ఆస్ట్రేలియాలో టీమిండియా-పాక్ వన్డే సిరీస్ నిర్వహించే అవకాశం ఉందా...?
TeluguStop.com
టీమిండియా, పాకిస్థాన్ జట్లు ఇంటర్నేషనల్ టోర్నీల్లో తప్ప వేరే టోర్నీలలో ఆడటం లేదు.
దీంతో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాక్ తో ఎప్పుడో ఒకసారి తలపడుతోంది.
అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఆ వార్త ప్రకారం, పాక్, ఇండియా త్వరలోనే ఒక ముక్కోణపు సిరీస్ ఆడనున్నాయి.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చీఫ్ నిక్ హాక్లీ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
భారత్, పాకిస్థాన్, ఆసీస్ మధ్య ఒక ముక్కోణపు సిరీస్‌ను జరపాలంటూ తన అభిప్రాయాన్ని హాక్లీ తాజాగా వ్యక్తపరిచారు.
త్వరలోనే జరగనున్న భారత్-పాక్, ఆసీస్ ముక్కోణపు సిరీస్‌లకు తాము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు హాక్లీ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా 2012లో ఆఖరిసారిగా భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడాయి.
ఆ తర్వాత ఈ రెండు జట్లూ ఎలాంటి సిరీస్ లో పాల్గొనలేదు.కాగా, ఇప్పుడు ఇవి ముక్కోణపు సిరీస్‌లో తల పడొచ్చని వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
"""/" /
ఈ ఏడాది ప్రారంభంలో పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా కూడా ముక్కోణపు సిరీస్ లేదా నాలుగు దేశాల సిరీస్‌ను నిర్వహించాలని ఐసీసీకి అర్జీ పెట్టుకున్నారు.
అయితే ఈయన కొత్తగా ఇంగ్లాండ్ పేరును కూడా ప్రస్తావించారు.ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా ఇంకా ముక్కోణపు సిరీస్ పై అధికారికంగా చర్చించలేదు.
అయితే త్వరలోనే దీనిపై చర్చ జరిపేందుకు ఆసీస్ క్రికెట్ బోర్డు రెడీగా ఉందని హాక్లీ తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం ఇండియా జట్టు చాలా క్రికెట్ బిజీగా ఉంది.దీన్నిబట్టి చూస్తుంటే త్వరలో కాకపోయినా వచ్చే ఏడాదిలో పాక్, టీమిండియా మధ్య ముక్కోణపు సిరీస్ జరగవచ్చని తెలుస్తోంది.
పల్చటి జుట్టు రెండు నెలల్లో దట్టంగా మారాలంటే ఇలా చేయండి!