వైసీపీ మేనిఫెస్టో ఇలా ఉండబోతుందా ?
TeluguStop.com
పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి.అధికార పార్టీ వైసిపి( YCP ), ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం( Telugudesam ) ప్రజల దృష్టిని ఆకర్షించి రాబోయే ఎన్నికల్లో గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాయి.
అందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయి.వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోలను( Manifestos ) రూపొందిస్తూ, ప్రజల దృష్టి తమ పార్టీలపై పడేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది.మూడు ప్రధాన వర్గాలను ఆకర్షించే విధంగా చంద్రబాబు( Chandrababu ) మేనిఫెస్టోను విడుదల చేశారు.
రెండో విడత మేనిఫెస్టోను అక్టోబర్ లో విడుదల చేస్తామని తెలిపారు.మొదటి విడత ప్రకటించిన మేనిఫెస్టోలో పూర్తిగా ఉచిత హామీలే ఎక్కువగా కనిపించాయి.
ఉచిత హామీలకు ప్రజలు బాగా కనెక్ట్ కావడంతో , ఆ పథకాలే తమకు అధికారం కట్టబడతాయనే అభిప్రాయంతో చంద్రబాబు ఆ పథకాల వైపు మొగ్గు చూపించారు.
వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అనేక విమర్శలు చేసిన బాబు మళ్లీ ఆ తరహా పథకాలను ప్రవేశ పెట్టడం పై వైసీపీ అనేక విమర్శలు చేసింది.
"""/" /
ఇది ఎలా ఉంటే ఏపీ అధికార పార్టీ వైసిపి తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
మేనిఫెస్టో లో ఉచిత పథకాలతో పాటు, అభివృద్ధి సంక్షేమం పైన ప్రధానంగా దృష్టి సారించి, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా కొత్త మేనిఫెస్టోను రూపొందించేందుకు ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుందట.
ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మొత్తాన్ని కొంతమేర పెంచడంతో పాటు, కొత్త పథకాలు కూడా సిద్ధం చేస్తున్నారట .
ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు , మహిళలతో పాటు, యువత ఎక్కువగా లబ్ధి పొందే విధంగా కొత్త స్కీములను చేర్చబోతున్నారట.
త్వరలోనే జగన్( Jagan ) జిల్లాల పర్యటనను మొదలుపెట్టబోతుండడం తో ఆ పర్యటనలో కొత్త మేనిఫెస్టోలోని ఒక్కో పథకాన్ని ప్రకటించే ఆలోచనతో ఉన్నారట.
"""/" /
మూడు రాజధానులతో తాను చేయబోయే అభివృద్ధిని మేనిఫెస్టోలో వివరించబోతున్నారట.ఇప్పటికే గతంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని, దాదాపు 98% పూర్తి చేసామని, వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఇంతకంటే ఎక్కువగా పథకాలను అందిస్తామని విషయాన్ని వైసిపి ప్రచారం చేసుకుంటోంది.
2014 ఎన్నికల సమయంలో టిడిపి ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడంతోనే, 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ని తిరస్కరించారని వైసిపి ప్రచారం చేస్తోంది.
ఇప్పుడు టిడిపి ఎన్ని ఉచిత హామీలను మేనిఫెస్టోలో చేర్చినా, వాటిని చంద్రబాబు అమలు చేయరనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైసిపి సిద్ధమవుతోంది.
అలాగే టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో కంటే మరింత మెరుగైన మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వైసిపి కసరత్తు చేస్తోంది.