భారత్, చైనా మధ్య గోడ.. త్వరలో కట్టబోతున్నారా..?
TeluguStop.com
భారత్, చైనా( India ) మధ్య ఇప్పటికే అనేక వివాదాలు నడుస్తున్నాయి.సరిహద్దు గొడవలతో పాటు అనేక గొడవలు రెండు దేశాల మధ్య ఉన్నాయి.
అయితే దేశాల మధ్య సరిహద్దు గోడలు అనేవి ఉంటాయి.ఇప్పటికే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా( Great Wall Of China ), చైనా వాల్, జర్మనీ వాల్ గురించి విన్నాం.
అయితే ఇప్పుడు చైనా, భారత్ సరిహద్దుల్లో కూడా ఒక భారీ గోడ నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌కు సరిహద్దు దేశాలుగా ఉన్న నేపాల్, పాకిస్తాన్, చైనాలో మనకు చాలా వివాదాలు జరుగుతున్నాయి.
సరిహద్దు గొడవలు చాలానే ఉన్నాయి. """/" /
అయితే ఇప్పుడు చైనా, భారత్ మధ్య గోడ విషయం సంచలనంగా మారింది.
దీంతో సరిహద్దు సమస్యకు పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య పెద్ద గోడ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వారణాసిలో మేధావులతో ఒక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కేంద్రమంత్రి జయశంకర్( Jayashankar )ను కొంతమంది మేథావులు గోడ కట్టే విషయం గురించి ప్రశ్నించారు.
అయితే భారత్, చైనా మధ్య గోడ కట్టే వార్తలను ఆయన తోసిపుచ్చారు.రెండు దేశాల మధ్య గోడల నిర్మాణం అనేది సాధ్యం కాని పని అంటూ జయశంకర్ స్పష్టం చేశారు.
"""/" /
గోడలను నిర్మించుకుంటే 1962లో చైనా ఆక్రమించుకున్న భూభాగాన్ని భౌగోళికపరంగా ఆ దేశానికి రాసిచ్చినట్లు అవుతుందని జయశంకర్ పేర్కొన్నారు.
జవహలార్ నెహ్రూ ( Jawaharlal Nehru )రాసిచ్చినా సరే.అది చైనా వాళ్ల భూభాగమని భారత్ ఒప్పుకోవడం లేదని, ఇప్పుడు అక్కడ గోడ కట్టడం వల్ల అది మన భూభాగం కాకుండా పోతుందని తెలిపారు.
దాని వల్ల గోడ కట్టే ప్రయత్నాలు ఏమీ చేయడం లేదని జయశంకర్ మేథావుల సమావేశంలో తేల్చిచెప్పారు.
దీంతో భారత్, చైనా మధ్య గోడ కట్టనున్నారనే వార్తలకు చెక్ పడింది.
యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!