మీ ఇంట్లో ట్యాప్ లీక్ అవుతుందా.. అయితే డేంజర్ సంకేతమే..!

సాధారణంగా సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి( Astrology ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.

అలాగే వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.వాస్తవానికి ఈ రెండు వేరువేరు కావు.

వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల సూచనలు కనిపిస్తే ఏదో అరిష్టం జరుగుతుందని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ట్యాప్ నిత్యం లిక్ అవుతుండడం, పాలు మరిగించినప్పుడు పొంగి బయటకు వస్తుండడం, ఇంట్లో ఆభరణాలు పోవడం లాంటి అశుభ సూచికలుగా చెబుతున్నారు.

ముఖ్యంగా కొన్ని వస్తువుల పట్ల నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ధన నష్టం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు.

"""/" / అందుకే వాస్తు ప్రకారం( Vastu ) ఇంట్లో ఏవి ఉండాలి.

ఏవి ఉండకూడదు.ఏవి ఎక్కడ ఉండాలి.

ఎక్కడ ఉండకూడదో పూర్తిగా వాస్తు శాస్త్రం చెబుతోంది.వాస్తు శాస్త్రంలో విభిన్న అంశాలు పరిణామాలకు శుభ, అశుభ సంకేతాలుగా భావిస్తారు.

ముఖ్యంగా భవిష్యత్తులో జరగనున్న అనుకూల లేదా ప్రతికూల ప్రభావ సంకేతాలు ఆ వ్యక్తికి ముందుగానే తెలుస్తుంది అని చెబుతున్నారు.

అందుకే ఈ సంకేతాలు లేదా లక్షణాలను సకాలంలో గ్రహించగలగాలి.లేదంటే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే లక్ష్మీదేవి ఆగ్రహానికి( Goddess Lakshmi ) బలి కావాల్సి ఉంటుంది. """/" / వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుళాయి కారుతుండటం మంచిది కాదు.

ఇలా జరిగితే ఆర్థికంగా నష్టం జరగవచ్చు.అందుకే మీ ఇంట్లో కిచెన్, బాత్రూం లేదా మరి ఎక్కడైనా కుళాయి కారుతూ ఉంటే వెంటనే రిపేరు చేసుకోవాలి.

నిర్లక్ష్యం చేస్తే మీ ఇంట్లో డబ్బులు క్రమ క్రమంగా తగ్గిపోతాయి.సాధారణంగా సనాతన ధర్మం ప్రకారం బంగారం, వెండిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు.

ఒకవేళ మీ ఇంట్లో నగలు దొంగతనానికి గురైతే లేదా పోగొట్టుకుంటే లక్ష్మీదేవి మీపై ఆగ్రహంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

అందుకే మీ ఇంట్లో ఆభరణాలను సురక్షితంగా ఉంచుకోవాలి.నిరంతరం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండాలి.

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం లక్ష్మీదేవికి ఇంట్లో పాలకు సంబంధం ఉంది.

అందుకే పాలతో చేసిన స్వీట్స్ లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడుతుంటారు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉంటుందని భావిస్తారు.