Rana Akhil : రానా అఖిల్ ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా చెప్పుకునే నందమూరి, మెగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల్లో చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అయితే ఈ జనరేషన్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్,( Venkatesh ) అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున( Nagarjuna ) లాంటి హీరోలు ఇండస్ట్రీ కి వచ్చినప్పటికి నాగచైతన్య, అఖిల్, రానా లాంటి హీరోలు వీళ్ళ ఫ్యామిలీల పేర్లు నిలబెట్టే విధంగా సినిమాలైతే చేయడం లేదు.
ఇక నందమూరి, మెగా ఫ్యామిలీల నుంచి వచ్చిన ఎన్టీయార్, రామ్ చరణ్ వరుస సక్సెస్ లను కొడుతున్నారు.
"""/" /
కానీ రానా( Rana ) అఖిల్( Akhil ) లు మాత్రం చాలా వెనకబడిపోతున్నారు.
ప్రస్తుతం రానా పరిస్థితి మరి దారుణంగా తయారయింది.అటు హీరోగా చేస్తున్నప్పటికీ అవి సక్సెస్ కావడం లేదు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో చేస్తూన్నాడు, అలాగే మరికొన్ని సినిమాల్లో విలన్ గా ( Villain Roles ) నటిస్తు తనకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా అన్ని పాత్రలని పోషిస్తూ వస్తున్నాడు.
అయినప్పటికీ హీరోగా నిలబడలేక పోతున్నాడు.ఆయన హీరోగా నిలబడాలంటే కాన్స్ టంట్ గా హీరో గా సినిమాలు చేస్తూ రావాలి.
కానీ రానా మాత్రం అలా చేయడం లేదు.దాంతో దగ్గుబాటి అభిమానులు వెంకటేష్ తర్వాత రానా స్టార్ హీరో అవుతాడు అని అనుకున్నారు.
"""/" /
కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆయన కరెక్టర్ ఆరిస్ట్ గా కొనసాగుతున్నాడు.
ఇక అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.ఇప్పటివరకు ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు.
ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది.అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఒక సక్సెస్ కూడా లేకపోవడంతో కూడా ఆయన ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశ కి గురవుతున్నారు.
నా భర్త అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!