అదే వైసీపీ అసలు ధీమానా ? 

ఏపీ రాజకీయాల్లో( AP Politics ) ఎప్పుడూ లేని విచిత్ర పరిస్థితి నెలకొంది.

టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళగా, వైసిపి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసింది.

అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి.అయితే అటు టిడిపి, ఇటు వైసిపిలు గెలుపు ధీమాతోనే ఉన్నాయి.

తమ మూడు పార్టీల బలంతో ఈసారి 150 స్థానాలకు పైగా గెలుచుకుంటామని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా, వైసిపి కూడా అంతే స్థాయిలో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

ఈసారి ఎన్నికల్లో గతం లో వచ్చిన 151 స్థానాలను మించిన స్థానాలను దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అంతేకాదు, జూన్ 9వ తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారోత్సావానికి ఏర్పాట్లు చేసుకుంటుంది.అప్పుడే వైసీపీ నాయకులు( YCP Leaders ) విశాఖలోని హోటల్స్ రూమ్ లు ముందస్తుగా బుకింగ్ చేయడం, ప్రమాణస్వీకారం ముహూర్తాన్ని నిర్ణయించడం వంటివి , కూటమి పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

"""/" / జూన్ 4న కౌంటింగ్ జరగనుండడంతో ఎవరు గెలుస్తారనేది అప్పుడు కచ్చితంగా తేలనుంది.

అంతకంటే ముందుగా జూన్ 1వ తేదీనే సర్వే నివేదికలు అధికారికంగా విడుదల కానున్నాయి.

గతంతో పోలిస్తే ఎప్పుడు లేని విధంగా ఏపీలో పోలింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే దానిపైన రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.

ప్రభుత్వంపై కసితో అంత పెద్ద సంఖ్యలో జనం పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారని కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, ఈసారి పాజిటివ్ ఓటు కారణంగానే ఇంత ఎక్కువ స్థాయిలో ఓటింగ్ జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

దీంతో పాటు, ఎన్నికల ప్రచారంలోనూ జగన్( Jagan ) మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటేనే ఓటు వేయాలంటూ జనాలను కోరడాన్ని, పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అంటూ కొన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం వంటివన్నీ తమకు కలిసి వస్తాయని వైసిపి లెక్కలు వేసుకుంటోంది.

"""/" / బస్సులు రైళ్లలో వచ్చిన వారంతా వైసీపీకి ఓటు వేశారని, కార్లు విమానాల్లో వచ్చిన వారు తమకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చని వైసిపి అంచనా వేసుకుంటోంది.

ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో మళ్లీ గెలిచేది తామేనని వైసిపి ధీమాగా ఉంది.

దీనికి తోడు ఐ ప్యాక్ టీం వైసీపీకి 156 స్థానాలకు తగ్గకుండా వస్తాయని రిపోర్ట్ ఇవ్వడంతోనే, జగన్ తో పాటు ,ఆ పార్టీ నాయకుల్లోనూ గెలుపు పై అంతస్థాయిలో ధైర్యం కనిపిస్తోందని , ప్రమాణ స్వీకారం విశాఖలోని చెప్పడమే కాకుండా, ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం వంటివి ఈ నివేదికల ఆదరంగానేనట.

సాఫ్ట్ బాల్ లో ప్రతిభతో చిన్న వయస్సులోనే గవర్నమెంట్ జాబ్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!