ప్రభాస్ ‘సలార్’ ప్రొమోషన్స్ కి ‘నో’ చెప్పడానికి కారణం నిర్మాతలతో జరిగిన గొడవ వల్లనేనా?

ఈరోజు నుండి సరిగ్గా పది రోజుల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సలార్( Salaar )' ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.

కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయి అనుకుంటే చాలా సింపుల్ గా ట్రైలర్ ఉందని, అసలు ప్రభాస్ రెండు నిమిషాల వరకు ట్రైలర్ లో కనిపించకపోవడం ఏమిటి అని అభిమానులు బాగా నిరాశకి గురి అయ్యారు.

హైప్ కూడా ఒకప్పుడు ఉన్న రేంజ్ లో ఇప్పుడు ఈ సినిమా పై లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే ఆడియన్స్ లో మరోసారి ఈ చిత్రం పై ఆసక్తి కలిగేలా ఒక యాక్షన్ ట్రైలర్ ని ఈ నెల 17 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

"""/" / అయితే పట్టుమని పది రోజులు కూడా లేవు, ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఇంకా ప్రారంభం కాలేదేంటి అని అభిమానులు కంగారు పడ్డారు.

మళ్ళీ సినిమాని వాయిదా వెయ్యడం లేదు కదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.

కానీ రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వడం తో, చెప్పిన డేట్ కి సినిమా విడుదల అవుతుంది అనే నమ్మకం అభిమానుల్లో కలిగింది.

ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు A రేటింగ్ ఇచ్చారు.సినిమాలోని సెకండ్ హాఫ్ లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే 15 నిమిషాల యాక్షన్ సన్నివేశం వియోలెన్స్ కి సరికొత్త నిర్వచనం తెలిపేలా ఉంటుందని సెన్సార్ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ కి ప్రభాస్ రాను అని నిర్మాతలతో తెగేసి మరీ చెప్పాడట.

అందుకు కారణం ప్రభాస్ మోకాళ్ళకు సర్జరీ జరగడం వల్ల, విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా రావడం లేదని సోషల్ మీడియా లో ఒక ప్రచారం ఉంది.

"""/" / అయితే అసలు విషయం అది కాదని, ప్రభాస్( Prabhas ) కి సినిమాని వాయిదా వేసినప్పటి నుండి డైరెక్టర్ పై, నిర్మాతలపై చాలా కోపం ఉందని అందుకే ప్రొమోషన్స్ కి రానని చెప్పినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన ప్రభాస్ రాకపోతే ఇక మనం ఏమి ప్రొమోషన్స్ చేస్తాం అని నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా రద్దు చేసినట్టుగా లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.

అంతే కాదు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) టేకింగ్ పట్ల ప్రభాస్ సంతృప్తి గా లేడని కూడా ఒక టాక్ వినిపిస్తుంది.

పార్ట్ 1 లోనే ముగించాల్సిన కథని, రెండు పార్టులుగా తీసేంత సాగదీత అవసరమా అనే దగ్గర నుండి ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ మధ్య విబేధాలు మొదలయ్యాయి అట.

తండేల్ విషయంలో భారీ రిస్క్ తీసుకున్న నిర్మాతలు.. చైతన్య సాయిపల్లవి ఏం చేస్తారో?