డబ్బులు ఎక్కువయ్యాయేమో.. రూ.500 నోట్లను గాలిలోకి విసిరిన వ్యక్తి.. వీడియో వైరల్‌..!

డబ్బులు ఎక్కువయ్యాయేమో రూ.500 నోట్లను గాలిలోకి విసిరిన వ్యక్తి వీడియో వైరల్‌!

కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా ఎవరూ కూడా విలువైన నోట్లను గాల్లోకి విసురుతూ చిత్తు కాగితాల్లా పడేయాలని అనుకోరు.

డబ్బులు ఎక్కువయ్యాయేమో రూ.500 నోట్లను గాలిలోకి విసిరిన వ్యక్తి వీడియో వైరల్‌!

కానీ తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి 500 రూపాయల నోట్లను ఏదో పాంప్లెట్లు విసిరినట్లు విసిరేశాడు.

డబ్బులు ఎక్కువయ్యాయేమో రూ.500 నోట్లను గాలిలోకి విసిరిన వ్యక్తి వీడియో వైరల్‌!

టూరిస్ట్ అట్రాక్షన్ చార్మినార్ వద్ద రూ.500 కరెన్సీ నోట్లను ఈ వ్యక్తి విసిరేశాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.

"డబ్బులు మరీ ఎక్కువ అయ్యాయా భయ్యా" అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.

30 సెకన్ల నిడివి ఉన్న ఈ వైరల్ వీడియోలో చార్మినార్ వద్ద గుల్జార్ హౌజ్ రోడ్డు ముందు ఓ వ్యక్తి నిలబడి కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి విసిరేస్తున్నట్లు మీరు చూడవచ్చు.

ఇంకా, ఆ వ్యక్తి గుల్జార్ హౌజ్ ఫౌంటెన్‌పై అనేకసార్లు ఇలానే చేస్తూ ఆశ్చర్యపరిచాడు.

ఈ వింత ఘటనను చుట్టుపక్కలవారు తమ సెల్‌ఫోన్‌లలో రికార్డు చేశారు.అయితే అతడు అలా ఎందుకు చేశాడో స్పష్టంగా తెలియరాలేదు.

స్థానిక మీడియా ప్రకారం ఈ వ్యక్తి తన స్నేహితుడి పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటూ ఇలా కరెన్సీ నోట్లను విసిరేసాడని తెలుస్తోంది.

అయితే ఆ సమయంలో అక్కడ చాలా తక్కువ మంది ప్రజలున్నారు.వారు కూడా నోట్లను ఎగబడి తీసుకునేందుకు ముందుకు రాలేదు.

అతడికి సంబంధించిన ఇతర వ్యక్తులు కిందపడిన నోట్లపై నడుస్తూ కనిపించారు.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

"పేదలకు విరాళం ఇవ్వండి కానీ ఇలా మన జాతీయ కరెన్సీ పట్ల అగౌరవం చూపకండి.

గర్వించదగిన మంచి పని ఏం చేయలేదు మీరు ” అని ఓ ట్విట్టర్ వినియోగదారు రాశారు.

ఈ వీడియోని మీరు వీక్షించండి.

నేను చచ్చిపోతా… నా బిడ్డలను కాపాడండి…పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు! 

నేను చచ్చిపోతా… నా బిడ్డలను కాపాడండి…పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!