టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ .. లిస్ట్ లో ఉంది వీరే ?
TeluguStop.com
ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి.
రెండు విడుదల అభ్యర్థులను జగన్ ప్రకటించగా, మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
దీంతో టీడీపీ కూడా దూకుడు పెంచింది.జనసేన, టిడిపి( Janasena, TDP ) కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో, సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన ఒక క్లారిటీకి వచ్చారు.
జనసేనకు మినహించగా మిగిలిన స్థానాల్లో టిడిపి అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు చంద్రబాబు( Chandrababu ) కసరత్తు పూర్తి చేశారు.
దాదాపు 60 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేశారు.ఈ జాబితాను సంక్రాంతి లోపు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
టిడిపిలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొదటి విడత జాబితాలో ఈ పేర్లు ఉన్నట్లు సమాచారం.
"""/" /
ఇచ్చాపురం బెందాళం అశోక్( Bendalam Ashok ), టెక్కిలి అచ్చెన్న నాయుడు, ఆముదాలవలస కూన రవికుమార్, పలాస గౌతు శిరీష, రాజాం కోండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, కురుపాం టీ.
జగదీశ్వరి, పార్వతీపురం బి విజయచంద్ర, విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమ గణబాబు పాయకరావుపేట అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతిల నెహ్రూ, పెద్దాపురం జనరాజప్ప, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు.
"""/" / దెందులూరు చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమ, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనుమలూరు బోడె ప్రసాద్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు దూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు ,సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవీ ఆంజనేయులు, గురజాల యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి ,వేమూరు నక్క ఆనందబాబు, పర్చూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామచర్ల జనార్ధన్, కొండెపి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి ,నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి ,నగరి గాలి భాను ప్రకాష్ ,పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం.
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)