ఎన్నికల హామీల అమలు ఇప్పట్లో కష్టమేనా ? బాబు అలా ఫిక్స్ అయ్యారా ?
TeluguStop.com
ఏపీ ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి ,జనసేన ,బిజెపి కూటమి ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చింది.
ముఖ్యంగా సూపర్ సిక్స్ ( TDP Super Six Schemes )పేరుతో ప్రకటించిన పథకాలు జనాలను బాగానే ఆకట్టుకున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలతో పాటు, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను అమలు చేస్తామని ప్రకటించారు.
అనుకున్నట్లుగానే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను పెంచి ఒకటో తారీకునే అందించారు.
దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీని జీతాలు చెల్లించారు .కానీ మిగిలిన ఎన్నికల హామీలను అమలు చేసే విషయంలో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది .
దీనికి కారణం ఆర్థికంగా ఏపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ఏడాదికి లక్ష యాభై వేల కోట్లు అవసరం అవుతాయి.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని నిధులను సమీకరించడం కష్టమనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.
దీంతోపాటు కేంద్రం ఈ విషయంలో తమకు సహకారం అందించి , భారీగా నిధులను ఏపీకి కేటాయిస్తుందా అంటే ఆ పరిస్థితి కనిపించను లేదు.
"""/" /
దీంతో సంక్షేమ పథకాలను( Welfare Schemes ) అమలు చేసే విషయంలో ఎటు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
దీంతో తాము ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారట.
ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు, 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ మంజూరు , ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, రైతు భరోసా, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారట.
అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలను అమలు చేద్దామన్నా, ఆ అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవడం , ఏడాదికి 1,50,000 కోట్లు ఖర్చు చేసే పరిస్థితి కనిపించకపోవడం తదితర కారణాలతో ఎన్నికల హామీలను మరికొంత కాలం పాటు వాయిదా వేస్తే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారట.
అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే సంపద పెరుగుతుందని, దాని ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని , అప్పుడు కొంత సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట .
"""/" /
జగన్( YS Jagan Mohan Reddy ) అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి సంక్షేమ పథకాలను అమలు చేసినా, పూర్తిస్థాయిలో ఎన్నికల హామీలను నెరవేర్చినా , వైసిపి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడం , 11 స్థానాలకే పరిమితం కావడంతో , చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డారట.
అందుకే ఐదేళ్లపాటు విడతల వారీగా ఎన్నికల హామీలను అమలు చేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారని,, మళ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట.
అలవోకగా పద్యం పాడిన అల్లు అర్హ.. ఈ చిన్నారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే!