బీఆర్ఎస్( BRS Party ) ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని నేతలంతా తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.
కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీఆర్ఎస్ అధిష్టానం పై విమర్శలు చేస్తుండగా, మరి కొంతమంది అలక చెందారు .
ఇంకొంతమంది కాంగ్రెస్ బిజెపిలలో చేరేందుకు సంప్రదింపులు చేస్తున్నారు.ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇలా అసంతృప్తి గురైన వారిలో ఎక్కువమంది మాజీ మంత్రులు, సీనియర్ నాయకులే కావడం గమనార్హం.
కెసిఆర్ ( CM Kcr )కచ్చితంగా తమకు టికెట్ ఇస్తారని ,వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశలు పెట్టుకున్న నేతలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు .
మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు( Motkupally Narasimhulu ) కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . """/" /
అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని మోత్కుపల్లి ఆశలు పెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ ఆశలు తీరకపోవడంతో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
నిన్ననే తన అనుచరులతో యాదగిరిగుట్టలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితుబంధు పథకం ప్రారంభానికి ముందు మోత్కుపల్లి నరసింహులు సలహాలు సూచనలు కేసీఆర్ తీసుకున్నారు.
కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు.ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్మెంట్ సైతం ఇవ్వడం లేదని మోత్కుపల్లి ఆవేదన చెందుతున్నారు.