కే‌సి‌ఆర్ అంటే భయమా.. అంతలేదు !

ఏపీ విశాఖ స్టీల్ ప్లాన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( KCR ) జోక్యం చేసుకున్నా సంగతి తెలిసిందే.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, ఆంధ్రుల హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అయ్యేంతవరకు తాము పోరాడుతూనే ఉంటామని, ఈ మద్య కే‌సి‌ఆర్ మరియు బి‌ఆర్‌ఎస్ నేతలు బలంగా చెబుతున్నారు.

అవసరమైతే తాము కూడా బిడ్డింగ్ లో పాల్గొంటామని కుండ బద్దలు కొడుతున్నారు.దాంతో స్టీల్ ప్లాంట్ అంశం హాట్ టాపిక్ గా మారింది.

బి‌ఆర్‌ఎస్( BRS ) జోక్యంతో ఏపీ ప్రభుత్వంపై కొంతమేర ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి.

"""/" / ఎందుకంటే పక్కా రాష్ట్రముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు పోరాడడం లేదనే ప్రశ్న ప్రతిఒక్కరిలోను నెలకొనడం సర్వసాధారణం.

దాంతో బి‌ఆర్‌ఎస్ వైసీపీ( YCP ) మద్య కూడా వార్ కొనసాగుతోంది.ఇదిలా ఉండగా స్టీల్ ప్లాంట్ విషయంలో అనూహ్యంగా కేంద్రం ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని స్పష్టం చేసింది.

దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు జరగకుండా కే‌సి‌ఆర్ అపారని, కే‌సి‌ఆర్ చొరవతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని బి‌ఆర్‌ఎస్ నేతలు చంకలు గుద్దుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతానికి మాత్రమే ప్రైవేటీకరణను హోల్డ్ లో పెట్టమని, ముందు రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కచ్చితంగా జరిగి తీరుతుందని కేంద్ర ఉక్కుసహాయక మంత్రి ఫగ్గన్ చెప్పడంతో బి‌ఆర్‌ఎస్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

"""/" / ఏపీలో తమ చొరవతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేశామనే నినాదంతో బలపడాలని చూసిన బి‌ఆర్‌ఎస్ నేతలకు ఇది మింగుడు పడని విషయమే.

గత కొన్నాళ్లుగా కే‌సి‌ఆర్ మరియు కేంద్రానికి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంతలా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఉప్పు నిప్పు లాగా బి‌ఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య రగడ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఎవరు వెనక్కి తగ్గిన మరొకరిది పైచేయి అనే భావన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది.

ఆయా పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటీకరణను హోల్డ్ లో పెట్టమని, భవిష్యత్ లో కచ్చితంగా జరిగి తీరుతుందని కేంద్రం చెబుతోంది.

ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఖరాకండిగా చెబుతోంది.కేంద్రం ఇచ్చిన ఈ రివర్స్ ఎటాక్ తో బి‌ఆర్‌ఎస్ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?