తాడేపల్లి పిలుపు అంత టెన్షన్ పెడుతోందా ?
TeluguStop.com
వైసిపి( YCP ) సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కుతుందా లేదా అనేది కంగారు పుట్టిస్తోంది.దీనికి కారణం వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పార్టీ టికెట్ల వ్యవహారంపై పూర్తిగా దృష్టి సారించడం , సర్వే నివేదికలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఆధారంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పనితీరును అంచనా వేస్తూ ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరుపై జనాల్లో వ్యతిరేకత ఉందనే విషయం తెలిస్తే వారిని తప్పించేందుకు ఏమాత్రం మొహమాట పడడం లేదు.
ఇప్పటికే అనేకమంది కి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనే విషయాన్ని నేరుగానే చెప్పేశారు.
మరికొంత మంది నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేశారు . """/" /
ప్రస్తుతం ఈ ప్రక్షాళన వైసీపీలో గందరగోళంగానే మారింది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90% నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తుండడం, ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇన్చార్జిలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం( Tadepalli Camp Office ) నుంచి పిలుపు రావడం వంటివి జరిగాయి.
టికెట్ దక్కే అవకాశం లేనివారిని స్వయంగా జగన్ పిలిపించుకుని వారికి అసలు విషయాన్ని చెప్పేస్తున్నారు .
దీంతో ఎవరికి ఎప్పుడు తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ వస్తుందో అని టెన్షన్ నెలకొంది .
మామూలుగా ఇతర పనులపై తాడేపల్లికి వైసిపి ఎమ్మెల్యేలు వెళ్లినా, వారికి టిక్కెట్ లేదనే ప్రచారం తెరపైకి వస్తోంది.
తాడేపల్లికి ఒక ఎమ్మెల్యే ఇతర పనుల పై వచ్చినా ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని.
"""/" /
ప్రత్యామ్నాయం చూస్తున్నారని, లేదా వేరే నియోజకవర్గానికి ఆయనను షిఫ్ట్ చేస్తున్నారనే ప్రచారం మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైసిపిలో ఈ అలజడిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో టిడిపి( TDP ) నిమగ్నమైంది.
టికెట్ దక్కదు అని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇన్చార్జిలతో సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది .
వచ్చే నెల సంక్రాంతి నాటికి వైసిపిలో దాదాపు అన్ని నియోజకవర్గాల కు అభ్యర్థులను ఖరారు చేసి, అధికారికంగా ప్రకటించబోతుండడంతో ఎవరి టికెట్ కు గ్యారెంటీ ఉంటుంది ? ఎవరి టికెట్ కు గండం పడనుందనేది వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి లకు కంగారు పుట్టిస్తుంది.
ఓజీ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్నారా.. రామ్ చరణ్ జవాబు ఇదే!