పవన్ వైఖరి పై బిజెపి అధిష్టానం అసంతృప్తి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున స్టార్ క్యాంపేనర్గా పవన్ కళ్యాణ్ ఉపయోగం పడతారాని చూసిన బిజెపి( BJP ) అధిష్టానం ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరలేదనే తెలుస్తుంది.

ముఖ్యంగా పేరుకి కూటమి తరపున ప్రచారం చేస్తున్న జనసేన అదినేత వ్యాఖ్యల్లో ఎక్కడ మునుపటి పదును కనిపించడం లేదు, ముఖ్యంగా ఆంధ్రాలో వరాహి యాత్ర సందర్భంగా కనిపించిన పవన్ ఆగ్రహపూరితమైన వైఖరి మీడియాలో సంచలనంగా మారేది .

"""/" / ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పవన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని వారాలపాటు ప్రతాక శీర్షికలు ఆక్రమించేవి .

సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా ఖాతరు చేయకుండా పవన్ విరుచుకుపడేవారు .కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం పవన్( Pawan Kalyan ) పక్తు రాజకీయ నాయకుడి లా మాట్లాడుతున్నాడు.

ముఖ్యంగా కేసీఆర్ అండ్ కొ ను విమర్శించడానికి ఆయనకు నోరు రావడం లేదు కేవలం నరేంద్ర మోడీ( Narendra Modi ) లాంటి బలమైన లీడర్ నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి కావాలన్న వ్యాఖ్యలు తప్ప, కేసీఆర్ అవినీతిపైన కానీ బి ఆర్ఎస్ పరిపాలనా వైఫల్యాల పై కానీ మాట మాత్రం గా కూడా వ్యాఖ్యానించడానికి పవన్ ఇష్టపడటం లేదు.

అయితే కేటీఆర్ మరియు కేసీఆర్ తో పవన్ కు ఉన్న సాన్నిహిత్యం వల్ల పవన్ మాట్లాడలేకపోతున్నారా? లేక ఎన్నికల తర్వాత బిజెపి ఎలానో బీఆరఎస్ అవగాహనతో ప్రబుత్వం ఏర్పాటు చేస్తుంది అన్న సమాచారం పవన్ దగ్గర ఉందో తెలియదు కానీ అనువు గాని చోట అధికుల మన రాదనే మధ్యే మార్గాన్ని పవన్ అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తుంది .

"""/" / అంతే కాకుండా తన దృష్టి అంతా రానున్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపైనే ఉందని తెలంగాణ రాజకీయాలు తనకు నామ మాత్రమేనని పవన్ నిరూపించుకున్నట్లయ్యింది .

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రచారం తో కింగ్ కాలేకపోయినా కనీసం కింగ్ మేకర్ అవ్వడానికైనా పవన్ సహాయ పడతాడు అన్న బిజెపి అధిష్టానం ఆశలపై పవన్ నీళ్లు చల్లేసారని మాత్రం చెప్పవచ్చు.

కిలాడీ లేడి.. వాటి కోసం ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకున్నమహిళ..