తీన్మార్ మల్లన్న చేరికతో బీజేపీ మరింత బలపడినట్టేనా?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ అనుక్షణం ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని ప్రజలకు పరోక్ష సంకేతాలు ఇచ్చే విధంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది.

ఇందులో భాగంగా బీజేపీని బలపర్చడానికి ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ సంస్థాగతంగా పార్టీని బలపరచాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్న ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న విధంగా త్వరలోనే బీజేపీలో చేరనున్న విషయం తెలిసిందే.

అయితే కేసీఆర్ పై భీకర స్వరంతో పెద్ద ఎత్తున విమర్శిస్తూ వార్తల్లో కూడా నిలిచిన పరిస్థితి ఉంది.

"""/" / అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా తెలంగాణ నిరుద్యోగ యువత అంతా మల్లన్న కు మద్దతు తెలపడంతో అధికార పార్టీ అభ్యర్థి ఒడిపోతారేమో అన్నంతలా తీన్మార్ మల్లన్నకు ఏకంగా 45 వేలకు పైగా ఓటు శాతం రావడం ఒక్కసారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే చివరికి ఓడిపోయినప్పటికి ఎక్కడా కూడా కేసీఆర్ పై తన దూకుడును తగ్గించని పరిస్థితి ఉంది.

అయితే మల్లన్న బీజేపీలో చేరడంతో బీజేపీకి అదనపు బలం తోడయిందనే చెప్పాలి.అయితే ఒకప్పుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా అందరూ ఒకటయ్యారు.

కానీ ఆ విపత్కర పరిణామాల్ని తనకు అనుకూలంగా చాలా చాకచక్యంగా కేసీఆర్ మార్చుకున్న పరిస్థితి కూడా ఉంది.

అయితే ప్రజలు ఏ విషయాలపై అగ్రహంగా ఉన్నారో ఆ విషయాలపై రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం వందకు వంద శాతం ఉంది.

లేకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చేస్తే పెద్దగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు.

ధనుష్ కొత్త టార్గెట్ ఏంటి అంటే..?