బండ్ల గణేష్‌ టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అవుతాడా?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో జాయిన్‌ అయిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దారుణమైన పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీకి దూరం అయ్యాడు.

ఆర్థిక అవసరాల దృష్ట్యా మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యాడు.ఒక వైపు ఫౌల్ట్రీ ఫామ్‌ను రన్‌ చేస్తూనే మరో వైపు సినిమాల్లో రీ ఎంట్రీకి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇదే సమయంలో ఈయన కేసీఆర్‌పై చేస్తున్న కామెంట్స్‌ టీఆర్‌ఎస్‌ వర్గాలనే కాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా కేసీఆర్‌ దేవుడు అన్నట్లుగా బండ్ల గణేష్‌ కామెంట్స్‌ చేస్తున్నాడు.

నేడు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం అవ్వడంతో మరోసారి కేసీఆర్‌పై బండ్ల గణేష్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

బండ్ల బాబు ట్విట్టర్‌లో అనుకున్న లక్ష్యం కోసం పుష్కర కాలం పోరాడి భారతదేశం నివ్వారు పోయే విధంగా తన తెలంగాణా సాధించి ఆరు సంవత్సరాలుగా అద్భుతం చేసి కోనసీమ కు దీటుగా సస్యశ్యామలం చేస్తూ తన జన్మ సార్థకం చేసుకున్న నేతకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు బండ్ల గణేష్⁦ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఈయన ట్వీట్స్‌ చూస్తుంటే వచ్చే ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో వైరల్: ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?