విజయశాంతి రాక కాంగ్రెస్ కి ప్లస్సా మైనస్సా..?

బీజేపీ పార్టీ లో కీలకంగా ఉన్న విజయశాంతి ( Vijayashanthi ) తాజాగా కాంగ్రెస్ లోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

మల్లికార్జున కార్గే ఆధ్వర్యంలో ఈమె కాంగ్రెస్ కండువా కప్పుకుంది.ఇక కాంగ్రెస్ లోకి వచ్చాక బీఆర్ఎస్ ( BRS ) బిజెపి గురించి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈమె గాంధీ భవన్లో మాట్లాడుతూ.బి ఆర్ ఎస్ బిజెపి ఒక్కటేనని, అందుకే నేను కాంగ్రెస్ కి వచ్చాను అని, బిజెపిలో బీఆర్ఎస్ కోవర్టు లు ఉన్నారని,వీరిద్దరూ తెర వెనుక ఒక్క పార్టీగానే ఉన్నారని,ఎందుకంటే కెసిఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో దొరికితే ఎందుకు బిజెపి సైలెంట్ గా ఉందని,వీరిద్దరికీ తెర వెనక ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని బయటికి తీయడం లేదని ఇలా ఎన్నో రకాల కామెంట్లు చేసింది.

అయితే విజయశాంతి కాంగ్రెస్ ( Congress ) లోకి రావడం ప్లస్సా మైనస్సా అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే విజయశాంతి కాంగ్రెస్ లోకి రావడం ఒక విధంగా కాంగ్రెస్ కి ప్లస్ అని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ప్రజా వ్యతిరేక ఓటును ఈమె మాటలు చాలావరకు ప్రభావితం చేస్తాయి.ఎందుకంటే ఇన్ని రోజులు బిజెపి పార్టీలో కీలక నాయకురాలిగా పనిచేసిన విజయశాంతి పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చాక బీఆర్ఎస్ బిజెపి ఒక్కటేనని చెప్పడం కాంగ్రెస్ కి ప్లస్ అని చెప్పుకోచ్చు.

"""/" / అయితే బిఆర్ఎస్ పార్టీ మాత్రం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని చెప్పుకుంటూ వస్తుంది.

ఇక విజయశాంతి చేసిన వ్యాఖ్యలు బిజెపి ( BJP ) బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పడానికి ఉదాహరణగా మారాయి.

అలాగే బిజెపి పార్టీ కాంగ్రెస్ మీద గెలిచేంత బలం తెలంగాణలో లేకనే బీఆర్ఎస్ పార్టీతో తెర వెనుక పొత్తు పెట్టుకుంది అనే వాదన కూడా వినిపిస్తోంది.

బిజెపి పార్టీలో బి ఆర్ ఎస్ కు చెందిన చాలామంది కోవర్ట్ లు ఉన్నారు అని విజయశాంతి మాట్లాడడం చాలా వరకు కాంగ్రెస్ కి కలిసివచ్చేలా కనిపిస్తోంది.

"""/" / ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ కి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు.

కానీ విజయశాంతి వ్యాఖ్యలతో బిఆర్ఎస్ కి ఓటు వేసినా బిజెపికి ఓటు వేసినా ఒకటేనని నమ్ముతూ కొంతమంది ఓటర్లు తమ నిర్ణయం మార్చుకొని కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తుంది.

ఈ లెక్కన విజయశాంతి రాక కాంగ్రెస్ కి కాస్త ప్లస్ అయినట్టే కనిపిస్తోంది.

మీ దగ్గర కర్రీ స్మెల్ రాకూడదా.. ఈ ఎన్నారై మహిళ చిట్కాలు తెలుసుకోండి..!