వైసీపీలో ఆ యువనేతే ఇప్పుడు హాట్ టాపిక్… ఒకే ఒక్కడు ?
TeluguStop.com
యువ నాయకుడు, వైసీపీలో దూకుడుగా వ్యవహరిస్తున్న దేవినేని అవినాష్ విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
తూర్పు నియోనజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న ఆయనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి.ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన యువ నాయకుడు రెండు సార్లూ ఓడిపోయారు.
దీనికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ సమకాలీన రాజకీయాల్లో అవినాష్ తన సత్తా ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అవినాష్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.గత రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు కాలం కలిసి రాలేదు.
ఓ సారి ముసలి కాంగ్రెస్ నుంచి మరోసారి నాన్ లోకల్ అయిన గుడివాడలో పోటీ చేసి ఓడిపోయారు.
ఈ క్రమంలో తాజాగా వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి విజయవాడ తూర్పు నియోజకవర్గంపై దేవినేని నెహ్రూ ముద్ర ఇప్పటికీ ఉంది.అయితే ఆ తర్వాత దేవినేని అవినాష్ కొన్నాళ్లు టీడీపీలో ఉన్నారు.