అందుకే విడదల రజనీ బీజేపీ లో చేరుతున్నారా ? 

అందుకే విడదల రజనీ బీజేపీ లో చేరుతున్నారా ? 

మాజీ మంత్రి వైసిపి( YCP ) కీలక నేతగా గుర్తింపు పొందిన విడుదల రజిని ( Vidudala Rajini )పార్టీ మారిపోతున్నారని ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అందుకే విడదల రజనీ బీజేపీ లో చేరుతున్నారా ? 

వైసీపీలో ఉంటే రాజకీయంగాను, వ్యక్తిగతంగా న ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో విడుదల రజిని పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అందుకే విడదల రజనీ బీజేపీ లో చేరుతున్నారా ? 

పార్టీ మారొద్దు అంటూ ఆమెపై వైసీపీ నుంచి పెద్ద స్థాయిలోనే ఒత్తిడి వస్తోందట.

"""/" /   విడతల రజినికి నచ్చచెప్పి పార్టీలోనే కొనసాగే విధంగా జగన్ , సజ్జల రామకృష్ణారెడ్డి ( Jagan, Sajjala Ramakrishna Reddy )ప్రయత్నించినా,  ఆమె మాత్రం అందుబాటులోకి రాకపోవడం పార్టీలో  చర్చనీయాంసంగా మారింది.

ఆమె వైసీపీని వీడాలని బలంగా నిర్ణయించుకోవడంతోనే ఆమె పార్టీ నేతలు ఎవరికీ అందుబాటులోకి రాకుండా,  మాట్లాడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదట.

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే గా విడుదల రజని గెలిచారు.ఆ తరువాత మంత్రి అయ్యారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా కీలకంగా వ్యవహరించారు.మంత్రిగా వుండగానే ఆమెపై అనేక ఆరోపణలు వచ్చాయి.

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. """/" / వీటన్నిటి పైన చిలకలూరిపేట ఎమ్మెల్యే ఆరా తీస్తున్నారని,  వాటిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని  కోరే ఆలోచనతో ఉన్నారు అనే విషయాన్ని గ్రహించిన విడుదల రజిని ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం ఏపీలో టిడిపి , జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో, బిజెపి లో చేరితే ఇబ్బందులు ఉండవని,  టిడిపి తన విషయంలో జోక్యం చేసుకోదు అని విడుదల రజిని భావిస్తుండడంతోనే,  బిజెపి నేతలతో అంతర్గతంగా చర్చిస్తూ,  పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు గా తెలుస్తోంది.

ప్రస్తుతం రజిని పార్టీ మార్పు వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయంలో రజని ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సిగ్గులేని కుటుంబాలు అంటూ భారతీయులపై ఓ మహిళ జాత్యహంకార కామెంట్స్!