ప్రభుత్వం పై ఆ వైసీపీ ఎమ్మెల్యేల విమర్శలు అందుకేనా ? 

గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP )లో గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి.

ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదు అని జగన్ నేరుగా సదరు ఎమ్మెల్యేలనే పిలిచి చెప్పేస్తున్నారు .

ఈ సందర్భంగా నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు,  సర్వే నివేదికలను వారి ముందే ఉంచి మీకు మళ్లీ టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు లేవని,  అందుకే మీ స్థానంలో వేరొకరికి అవకాశం ఇస్తున్నామని, పార్టీ విజయం కోసం మీరు కృషి చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు సముచిత స్థానం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు.

దీంతో కొంతమంది జగన్ మాటలతో ఏకీభవిస్తుండగా, మరికొంతమంది మాత్రం తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.

ఇంకొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. """/" /  ఇలా అసంతృప్తికి గురైనవారిలో మొదటిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.

ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడు.వైఎస్ కుటుంబానికి వీర  విధేయుడుగాను ఉన్నారు.

అయినా ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదనే విషయాన్ని జగన్ చెప్పేశారు.దీంతో అసంతృప్తి చెందిన రామకృష్ణ రెడ్డి రాజీనామా చేశారు.

ఇక అప్పటి నుంచి టిక్కెట్ దక్కే అవకాశం లేదనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా పార్టీ, ప్రభుత్వ విధానాలపై సందర్భం వచ్చినప్పుడల్లా, సెటైర్లు వేయిస్తుండగా,  మరి కొంతమంది బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం పైన అన్న రాంబాబు( Anna Rambabu ) విమర్శలు చేశారు.

రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మాట్లాడారు.దీంతో అన్నా రాంబాబు కు వైసీపీలో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో,  పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా అందరికీ అర్థం అయ్యింది.

"""/" / ఆ తర్వాత వెనక్కి తగ్గిన రాంబాబు తాను వైసీపీలోనే కొనసాగుతానని , తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని,  కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు( MLA Kondeti Chittibabu ) కు టికెట్ లేదనే విషయం చెప్పేయడంతో ఆయన అసంతృప్తితోనే ఉన్నారు.

ఆయనకు చెందిన అనుచరులు చాలామంది పార్టీకి రాజీనామా చేశారు.ఇదే విధంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని గ్రహించిన వైసిపి ఎమ్మెల్యేలు అంతా ప్రత్యామ్నయ మార్గాలను వెతుక్కునే క్రమంలోనే సొంత పార్టీ పైన విమర్శలు చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు.

దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!