తన సినిమాలో ఆ హీరో సన్నివేశాలు వెంకటేష్ కత్తిరించడానికి కారణం అదేనా!

ఎన్టీఆర్ ,కృష్ణ కాలం తర్వాత రెండవ తరం హీరోలు స్టార్ స్టేటస్ లోకి వచ్చినప్పుడు మల్టీస్టార్ర్ర్ చిత్రాల హవా బాగా తగ్గిపోయింది.

సరైన స్క్రిప్టులు దొరకకా, అభిమానులను సరిసమానంగా మ్యాచ్ చేయగలమో లేదో అనే భయం తో మల్టీస్టార్రర్ సినిమాలు చేసే సాహసం చేసేవారు కాదు.

అలాంటి సమయం లో విక్టరీ వెంకటేష్( Venkatesh ) ధైర్యం గా ఒక అడుగు ముందుకు వేసి మహేష్ బాబు తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రం' చేసాడు.

ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో ఎక్కువగా మల్టీస్టార్ర్ర్ చిత్రాలు రావడం మొదలయ్యాయి.

అందులో ఎక్కువ శాతం విక్టరీ వెంకటేష్ చేసినవే ఉంటాయి.పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, నాగ చైతన్య రామ్ , వరుణ్ తేజ్ ఇలా ఎంతో మంది తో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు.

"""/" / అలా వరుసగా మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేస్తూ వచ్చిన వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరో గా నటించిన సినిమా 'సైన్ధవ్( Sandhav Movie )'.

తన కంఫర్ట్ జోన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ ని పక్కన పెట్టి ఈసారి యాక్షన్ జానర్ తో మన ముందుకు రాబోతున్నాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది.

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

వెంకటేష్ ని చాలా కాలం తర్వాత ఊర మాస్ అవతార్ లో చూసే అదృష్టం దక్కింది అంటూ వెంకటేష్ అభిమానులు మురిసిపోతున్నారు.

కచ్చితంగా ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లో ల్యాండ్ మార్కుగా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

హిట్ సిరీస్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

"""/" / అయితే ఈ చిత్రం లో తమిళ హీరో ఆర్య( Arya ) కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

కానీ మొన్న విడుదలైన టీజర్ లో ఆర్య కి సంబంధించి ఒక్క షాట్ కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలుగచేసింది.

సినిమా చిన్న పాత్ర పోషించిన ఆండ్రియా( Andrea ) కూడా ఈ టీజర్ లో ఒక షాట్ అప్పుడు కనిపిస్తుంది.

ఆమెకి ఉన్న ప్రాముఖ్యత కూడా ఆర్య కి లేదా అంటూ తమిళ ఆడియన్స్ వెంకటేష్ ని ట్విట్టర్ ట్యాగ్ చేసి తిడుతున్నారు.

అయితే ముందుగా వచ్చిన విజువల్స్ లో హారో ఆర్య షాట్స్ ఉండేవట .

కానీ వెంకటేష్ ఆర్య కి ప్రత్యేకంగా గ్లిమ్స్ వీడియో విడుదల చేద్దాంఅప్పటి వరకు ఆర్య ని ప్రమోషనల్ కంటెంట్ కోసం వాడుకోవద్దు అని అన్నాడట వేంకటేష్.

ప్రస్తుతం ఈ వెంకీ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నా లెగసీని కంటిన్యూ చేసేది అతనే…. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!