హీరోయిన్ మెహ్రీన్ తో సాయి ధరమ్ తేజ్ లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )ముందు వరుసలో ఉంటాడు.

ఈయన తోటి హీరోలు కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకొని పిల్ల పాపలతో మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ సాయి ధరమ్ తేజ్ కి మాత్రం అసలు పెళ్లి మీద ఆసక్తి లేనట్టుగా అనిపిస్తూ ఉంది.

అనేక ఇంటర్వ్యూస్ లో పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు ఆయన రియాక్షన్స్ చూస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుంది.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే విషయం కాసేపు పక్కన పెడితే, సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలు చాలా బలంగానే నడిపాడు.

తిక్క హీరోయిన్ లరిస్సా తో, ప్రముఖ హీరోయిన్ రెజీనా తో సాయి ధరమ్ తేజ్ ప్రేమ వ్యవహారం నడిపినట్టు అప్పట్లో ఏ రేంజ్ లో టాక్ నడిచిందో అందరికీ తెలిసిందే.

"""/" / ఆ తర్వాత రాశి ఖన్నా తో కూడా సాయి ధరమ్ తేజ్ ప్రేమ వ్యవహారం నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఇలా ఆయన పని చేసిన ప్రతీ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి.

ఈ లిస్ట్ లో ప్రముఖ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడా( Mehreen Pirzada ) కూడా ఉంది.

ఈమెతో కలిసి సాయి ధరమ్ తేజ్ జవాన్( Jawaan ) అనే చిత్రం చేసాడు.

ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.అయితే ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ మెహ్రీన్ తో కలిసి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం, అలాగే వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి అందరూ వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అని అనుకోవడం జరిగింది.

ఇండస్ట్రీ లో కూడా వీళ్ళ ప్రేమాయణం గురించి ఎన్నో కథనాలు ప్రచారం అయ్యాయి.

అయితే సాయి ధరమ్ తేజ్ అప్పట్లో దీనికి చాలా తెలివైన సమాధానం చెప్పాడు.

"""/" / ఆయన మాట్లాడుతూ 'అవును మెహ్రీన్ తో లవ్ ఎఫైర్ ఉంది.

సీక్రెట్ గా పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాను' అని చెప్పుకొస్తాడు.యాంకర్ ఆశ్చర్యపోగా, అప్పుడు సాయి ధరమ్ తేజ్ మరో క్లారిటీ ఇస్తూ 'లేకపోతే ఏమిటండి.

ఎవరో ఎదో మాట్లాడితే దానిని తీసుకొచ్చి నన్ను అడుగుతారా.' అని వ్యగ్యంగా సమాధానం ఇస్తాడు.

కానీ ఇండస్ట్రీ లోని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ఏమిటంటే, అప్పట్లో సాయి ధరమ్ తేజ్ తరచూ ( Sai Dharam Tej )మెహ్రీన్ ఫ్లాట్ కి వెళ్తూ ఉండేవాడని, ఇద్దరూ కలిసి పార్టీలకు, పబ్బులకు వెళ్లడం వంటివి చుట్టూ పక్కన ఉన్నవారు గమనించారని అంటున్నారు.

ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?