బిచ్చగాడు మూవీ హీరోయిన్ కెరియర్ నాశనం అవ్వడానికి అదొక్కటే కారణం..?

2016 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా వ‌చ్చి ఘన విజయం సాధించిన సినిమా బిచ్చగాడు( Bichagadu ).

ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు.

శశి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ ( Vijay Antony )హీరోగా న‌టించాడు.

ఆయ‌న‌కు జోడీగా సట్నా టైటస్( Satna Titus ) హీరోయిన్ గా చేసింది.

మొద‌ట ఈ సినిమాను త‌మిళంలో విడుద‌ల చేయ‌గా అక్క‌డ మంచి విజ‌యం సాధించింది.

"""/" / దాంతో కొద్ది రోజుల గ్యాప్ లోనే ఈ మూవీని తెలుగులో విడుద‌ల చేశారు.

అయితే ఈ సినిమా త‌మిళంలో కంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ ను తెలుగులో రాబ‌ట్ట‌డం విశేషం.

అంత‌లా తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఆధ‌రించారు.ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా బిచ్చ‌గాడు 2 ( Bichagadu 2 )తెర‌కెక్కుతోంది.

ఇక‌పోతే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన సట్నా టైటస్ గుర్తుండే ఉంటుంది.

గురు సుక్రాన్` అనే త‌మిళ మూవీతో కెరీర్ ప్రారంభించిన‌ స‌ట్నా.బిచ్చ‌గాడు మూవీతో అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది.

"""/" / ఇందులో ఆమెది డీ గ్లామర్ రోల్ అయ్యినప్పటికీ కూడా చాలా అందంగా మరియు హోమ్లీ గా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంది.

బిచ్చ‌గాడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌ట్నాకు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి.

కానీ, ఆమె ఒప్పుకోలేదు, అప్పటి వరకు కమిట్ అయిన కొన్ని సినిమాలను పూర్తి చేసి సినిమాలకు శాశ్వతంగా దూరం అయింది.

అందుకు కార‌ణం బిచ్చ‌గాడు మూవీ డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ Movie Distributor Karthik )తో ప్రేమ‌లో ప‌డ‌టమే.

ఇంట్లో వీరి ప్రేమ‌ను నిరాక‌రించ‌డంతో.కార్తీక్‌-స‌ట్నా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు.

దాంతో స‌ట్నా త‌ల్లిదండ్రులు కార్తీక్‌పై కేసు కూడా పెట్టారు.ఆ తర్వాత వాళ్ళే కేసు వెనక్కి తీసుకొని వీళ్లిద్దరికీ 2017 వ సంవత్సరం లో అధికారికంగా మరోసారి ఘనంగా పెళ్లి చేసారు.

ఈ దంప‌తుల‌కు ఓ కొడుకు జ‌న్మించాడు.మొత్తానికి స‌ట్నా ప్రేమ, పెళ్లి అంటూ చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంది.

లేకపోతే ఇప్పటికే తను టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునేది అని చాలా మంది ఆమె గురించి మాట్లాడుతూ ఉంటారు.

పుష్ప2 1400 కోట్లు.. మిస్ యూ 2 కోట్లు.. సిద్దార్థ్ ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా?