ఆ ఒక్కటే దేవర సినిమాకు మైనస్ అవుతోందా.. తారక్ గ్రహించాల్సిన సత్యం ఇదే!

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్( NTR ) హీరోగా నటించిన సినిమా దేవర.

( Devara ) ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేశ వ్యాప్తంగా దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎన్టీఆర్ కెరియర్ లోనే దేవర బెస్ట్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.సాంగ్స్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మూడు పాటలు కూడా దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. """/" / సెకండ్ సింగిల్ గా వచ్చిన రొమాంటిక్ మెలోడీ, మూడో సాంగ్ గా రిలీజ్ అయిన దావుదీ డ్యూయెట్ కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసినట్లు తెలుస్తోంది.

విజువల్ గా చూడటానికి ఈ రెండు పాటలు బాగానే ఉన్నా కూడా హై స్టాండర్డ్స్ లో లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే దేవర రెండు సాంగ్స్ కోసం వేసిన సెట్ వర్క్ హైస్టాండర్డ్స్ లో లేవనే మాట విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

విజువల్ బాగున్న కూడా ఆ సెట్ వర్క్స్ ఏవీ కూడా పాన్ ఇండియా( Pan India ) బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసే స్థాయిలో లేవని అంటున్నారు.

రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉన్నట్లు మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి.ప్రొడక్షన్ వేల్యూస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లు చెబుతున్న కూడా పాటల్లో ఆ రిచ్ నెస్ ఎక్కడా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

"""/" / గతంలో ఎన్టీఆర్ జై లవకుశలో సాంగ్స్ కోసం వేసిన సెట్ వర్క్స్ కూడా అంత క్వాలిటీగా లేవని అంటున్నారు.

పాన్ ఇండియా లెవల్ లో అందరికి రీచ్ అవ్వాలంటే సాంగ్స్ విజువలైజేషన్ కి తగ్గట్లుగానే సెట్ వర్క్ కూడా హెవీ స్టాండర్డ్స్ లో ఉండాలనే మాట వినిపిస్తోంది.

దేవర సినిమాకి ఇప్పటి వరకు అయితే ఈ ఒక్కటే మైనస్ గా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరి ఈ విషయంలో మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

విడుదల తేదీకి మరొక 20 రోజులు మాత్రమే సమయం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 10, గురువారం 2024