వెట్రి మారన్ డైరెక్షన్ లో ఆ స్టార్ హీరో నటించబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం అల్లు అర్జున్ ( Allu Arjun )పుష్ప 2 సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

ఇక ఇదిలా ఉంటే మిగతా హీరోలు కూడా భారీ సినిమాలను చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు యంగ్ హీరో అయిన నాగచైతన్య ( Naga Chaitanya )సైతం తండేల్ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

"""/" / ఇక ఈ సినిమా తర్వాత తమిళ్ సినిమా డైరెక్టర్ ( Tamil Film Director )అయిన వెట్రి మారన్ కలిసి ఒక భారీ సినిమాను చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే వెట్రిమోరన్ విడుదల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేరకు మెప్పించలేదనే చెప్పాలి.

ఇక దానికి అనుగుణంగానే నాగచైతన్య తో ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాను చేసి మంచి విజయాన్ని సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి వెట్రి మారన్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఆసక్తి ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ( NTR ,Ram Charan )లాంటి స్టార్ హీరోలతో సైతం అతను సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు.

"""/" / కానీ నాగచైతన్యతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

మరి ఆయన ఎందుకు స్టార్స్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అంటే అతనికి కథలకు స్టార్ ఇమేజ్ అనేది పనిచేయదు.

కేవలం కాంట్రాక్టు బేస్డ్ సినిమాలతోనే ముందుకు వెళ్తుంటాడు కాబట్టి చిన్న హీరోలతో చేసే సినిమాలు వర్కౌట్ అవుతూ ఉంటాయి.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో భారీ సక్సెస్ ను సాధిస్తూ టాప్ డైరెక్టర్ గా ముందుకు వెళ్తున్న ఆయన ఇక మీదట కూడా అలానే వెళ్ళాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

కన్నడ బిగ్ బాస్ విన్నర్ కూడా రైతుబిడ్డనే.. ఎంత ఫ్రైజ్ మనీ గెలిచాడంటే?