‘నల్లారి ‘ నమ్మకం అదేనా ?  ఆ పార్టీ నుంచి భారీగా చేరికలు ? 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్( Nallari Kiran Kumar ) కొద్దిరోజులు కిందటే బిజెపిలో చేరిపోయారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం,  రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిచయాలు ఇవన్నీ లెక్కలు వేసుకుని బిజెపి కిరణ్ కుమార్ ను పార్టీలో చేర్చుకుంది.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ ను చేర్చుకోవడం ద్వారా,  అటు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడంతో పాటు,  ఏపీలోనూ బిజెపిని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని బిజెపి( BJP ) హై కమాండ్ అంచనా వేసి పార్టీలో చేర్చుకుంది.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

"""/" / అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీనిలో భాగంగానే బిజెపి హై కమాండ్ పెద్దల వద్ద తన ప్రాధాన్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెటనట్లు తెలుస్తోంది.

భారీగా చేరికలు ఉండేలా చూసుకుంటే,  తనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

అందుకే చేరికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.దీనిలో భాగంగానే ఏపీలో విస్తృతంగా పర్యటించాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.

త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ పర్యటన కూడా ఖరారు కాబోతోంది.గతంలో రాజకీయాల్లో కీలకంగా ఉండి,  ఇప్పుడు సరైన ప్రాధాన్యం దక్కకుండా ఉన్న నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారు .

"""/" / దీనిలో భాగంగానే కాంగ్రెస్( Congress ) లో ఉన్న కీలక నేతలను ఆయన పార్టీలో చేర్పించే విధంగా ప్రయత్నాలు మొదలు పట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ లో కీలక నేతలు గా గుర్తింపు పొందిన కొంతమంది  టిడిపి, వైసీపీ లోకి వెళ్లలేక సైలెంట్ గా ఉండిపోయారు.

ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం లేకపోవడంతో, వారి పైన కిరణ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కేంద్ర మాజీమంత్రి ఎం ఎం పల్లం రాజు ను కిరణ్ కిరణ్ ఒప్పించారట.

అలాగే ఏరా సు ప్రతాపరెడ్డి,  మాజీ పీసీసీ చీఫ్ శైలజనాథ్,  రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తో పాటు మరికొంతమంది కీలక నేతలతో కిరణ్ చర్చలు జరిపారట.

త్వరలోనే వారిని ఢిల్లీ పెద్దల సమక్షంలో బీజేపీ లో చేర్పించబోతున్నారట.

కల్కి Vs యానిమల్: కొత్త వివాదానికి తెరలేపిన నెటిజన్లు..