పాదయాత్ర చేయనున్న విజయ్.. ఇదంతా పొలిటికల్ ఎంట్రీ కోసమేనా ?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఒకరు.

ఈయనకు తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం విజయ్ కు మాత్రమే ఉంది అంటే అతియసోక్తి కాదేమో.

ఈయన సినిమా వస్తుందంటే చాలు అక్కడ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అనే చెప్పాలి.

యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా 200 కోట్లు ఈజీగా రాబట్టగలిగే సత్తా ఈయనకు ఉంది.

మరి అలాంటి బలమైన హీరో రాజకీయాల్లోకి( Politics ) వస్తే ఎలా ఉంటుంది.

అందుకే ఈయన రాజకీయ ఎంట్రీపై అక్కడ ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు.ఇప్పటికే ఈయన రాజకీయ రంగప్రవేశంపై ఎన్నో సార్లు వార్తలు వైరల్ అయ్యాయి.

మరి తాజాగా విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది.

"""/" / ప్రస్తుతం దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ''లియో'' సినిమా( Leo Movie ) చేస్తున్నాడు.

ఇప్పటికే పూర్తి అయ్యిన ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.

ఇదిలా ఉండగా విజయ్ పాలిటిక్స్ మీద తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

"""/" / విజయ్ తమిళనాడులో పాదయాత్ర( Padayatra ) ప్లాన్ చేస్తున్నాడు అని లియో సినిమా రిలీజ్ కు ముందే ఈ పాదయాత్ర ఉంటుందని అంటున్నారు.

మరి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రాజకీయ పరంగానేనా లేదంటే లియో సినిమా కోసమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

కానీ ఈయన పాదయాత్ర చేస్తే రాజకీయంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

చూడాలి ఎప్పుడు పాదయాత్ర మొదలవ్వనుందో.నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఉంటే మాత్రం ఈయన గెలవడం ఎవ్వరూ ఆపలేరు.

ఇప్పుడే రాకపోయినా ఈయన మెల్లమెల్లగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Game Load Optimization & Casino Advertising Ethics For Canadian High Rollers