చింత‌పండు ఆరోగ్య‌క‌ర‌మా? కాదా?.. ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు!

చింత‌పండు ఆరోగ్య‌క‌ర‌మా? కాదా? ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు!

మన వంటకాల్లో విరివ‌గా ఉప‌యోగించే పదార్థాల్లో చింత‌పండు ( Tamarind )ఒక‌టి.తీపి, పులుపు రుచుల‌ను క‌ల‌గ‌లిసి ఉండే చింత‌పండు వంట‌లకు ప్ర‌త్యేక‌మైన రుచిని జోడిస్తుంది.

చింత‌పండు ఆరోగ్య‌క‌ర‌మా? కాదా? ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు!

అయితే కొంద‌రు చింత‌పండు ఆరోగ్యానికి మంచిది కాద‌ని భావిస్తుంటారు.చింత‌పండుకు బ‌దులుగా నిమ్మ‌కాయ‌ల‌ను వాడుతుంటారు.

చింత‌పండు ఆరోగ్య‌క‌ర‌మా? కాదా? ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు!

అస‌లు చింత‌పండు ఆరోగ్య‌క‌ర‌మా? కాదా? అంటే.ఆరోగ్య‌క‌ర‌మే అని చెప్పాలి.

చింత‌పండులో అనేక‌ ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ప‌రిమితంగా తీసుకుంటే చింత‌పండు బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.

చింతపండులో ఉండే పొటాషియం( Potassium ) రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.గుండె ఆరోగ్యానికి ప్ర‌యోజన‌క‌రంగా ఉంటుంది.

చింతపండులో మెండుగా ఉండే విటమిన్ సి మ‌రియు శ‌క్తివంత‌మైన‌ యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

చింతపండు సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది, అందువ‌ల్ల వంటల్లో చింతపండు ఉపయోగిస్తే.మూత్రపిండాల్లో టాక్సిన్లు బ‌ట‌య‌కు వెళ్లిపోతాయి.

చింతపండు ఐరన్‌తో( Iron ) సమృద్ధిగా ఉంటుంది.ఇది రక్తహీనతను నివారిస్తుంది.

చింత‌పండులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.అయితే చింత‌పండుతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.

కొంద‌రు మాత్రం దానిని తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.ఆ కొంద‌రు ఎవ‌రు అన్న‌ది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / చింతపండు ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది.కాబట్టి, త‌ర‌చూ గ్యాస్ట్రిక్ సమస్యలతో ( Gastric Problems )బాధపడుతున్న వారు చింత‌పండును తినడం బాగా తగ్గించాలి.

అలాగే చింతపండులో సహజ చక్కెరలు ఉండ‌టం వ‌ల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.

అందువ‌ల్ల మ‌ధుమేహం ఉన్న‌వారు చింత‌పండు తీసుకునే ముందు డాక్ట‌ర్ల స‌ల‌హా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

"""/" / రక్తాన్ని పలచగా చేసే గుణాలు చింతపండులో ఉన్నాయి.ఆల్రెడీ బ్లడ్ థిన్నింగ్ మందులు వాడుతున్న‌ట్లైతే చింత‌పండును ఎవైడ్ చేయండి.

చింత‌పండును ర‌క్త‌పోటును త‌గ్గిస్తుంద‌ని పైన చెప్పుకున్నాం.అందువ‌ల్ల అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారికి చింత‌పండు తీసుకోవ‌చ్చు.

కానీ, లో-బీపీ ఉన్న‌వారు మాత్రం చింత‌పండును ఎంత త‌క్కువ వాడితే అంత మంచిది.

ఇక గ‌ర్భిణీలు కూడా చింత‌పండును చాలా మితంగా తీసుకోవాలి.

మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయకపోవడానికి కారణం ఏంటంటే..?