ఎస్పీ గులాబీ కార్యకర్తనా:కాంగ్రేస్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ వజ్రోత్సవ ర్యాలీలో భాగంగా జాతీయ జెండాకు అవమానం కలిగించడమే కాకుండా ఒక జిల్లా ఎస్పీగా పని చేస్తున్న అధికారి బహిరంగంగా మంత్రికి జై కొట్టడంపై
ప్రతిపక్ష నాయకులు,కాంగ్రేస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అంతా కలుషితమయ్యారని,అధికార పార్టీకి కార్యకర్తల్లాగా మారిపోయి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఇది సరైన చర్య కాదని అన్నారు.
ఐఏఎస్,ఐపీఎస్లు అధికార పార్టీ నాయకుల కాళ్ళు మొక్కడం, జిందాబాద్ లు కొట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు.
అంత రాజకీయాలు చేయాలని ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి పార్టీలో చేరితే పోయేదని ఎద్దేవా చేశారు.