జనసేన విషయంలో వీర్రాజు ఫిక్స్ అయిపోయారుగా ?

జనసేనతో పొత్తు విషయంలో సొంత పార్టీ నేతలు ఏ రకమైన కామెంట్లు చేస్తున్నా.

ఎన్ని చేసినా తమతో కలిసి రాదనే నిట్టూర్పు వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veeraju ) మాత్రం జనసేనతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్లాలని బలంగా ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.

అందుకే జనసేన బిజెపిని ఎంతగా దూరం పెడుతున్నా, పొత్తు రద్దు చేసుకుని టిడిపి తో జతకట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న వీర్రాజు మాత్రం జనసేన బిజెపి కలిసే ఎన్నికలకు వెళ్తాయని మరోసారి ప్రకటించారు.

ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిని నిలబెట్టినా జనసేన సహకరించలేదని, పిడిఎఫ్ అభ్యర్థి తనకు జనసేన మద్దతు ఉందని ప్రచారం చేసుకున్న జనసేన ఖండించలేదని, బిజెపి అభ్యర్థికి మద్దతుగా పవన్ కనీసం మాట్లాడలేదని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు పెద్ద సంచలనమే రేపాయి. """/" / పొత్తుల విషయంలో చాలా ఆలోచనలు ఉన్నాయని, ఏపీలో బిజెపి సొంతంగా ఎదగాలనుకుంటుంది అంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలతో జనసేనతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో బిజెపి ఉందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలిగాయి.

అయితే తాజాగా ఈ వ్యవహారాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

జనసేన సహకరించడం లేదని, తమ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన కామెంట్స్ పై స్పందించేందుకు వీర్రాజు నిరాకరించారు.

' జనసేన( Janasena )తో విడిపోతామని నేను చెప్పను.మేం విడిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు.

వారి కోరిక ఫలించకపోవచ్చు.జనసేన సహకరించడం లేదని మాధవ్ కామెంట్స్ పై నేను స్పందించను.

బిజెపి వైసిపి ఒకటే అనేది అపోహ మాత్రమే. """/" / ప్రభుత్వ వ్యతిరేకత ఏపీలో ఉంది.

ఏపీలో బీజేపీని అన్ పాపులర్ చేయాలని చూస్తున్నారు.ఏపీలో బలపడేందుకు క్షేత్రస్థాయిలో పోరాటాలకు ప్లాన్ చేస్తాం అంటూ వీర్రాజు వ్యాఖ్యానించారు.

  అంతేకాదు వైసిపి తో కలిసి బిజెపి పని చేస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.

ఈ విషయం పైన వీర్రాజు స్పందించారు.వైసీపీ ప్రభుత్వం పై పజల్లో వ్యతిరేకతో ఉందని, వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలపై బిజెపి పోరాటం చేస్తూనే ఉంటుందంటూ వీర్రాజు అన్నారు.

మొత్తంగా వీర్రాజు వ్యాఖ్యలను పరిశీలిస్తే జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేకపోయినా, బిజెపి మాత్రం జనసేన ను కలుపుకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది.

ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బలంగా ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తున్నారు.

వీడియో వైరల్‌: కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..