జార్ఖండ్ లో ప‌గ్గాలు ఆమెకేనా..?

జార్ఖండ్ లో రాజకీయాలు ఊపందుకున్నాయి.సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు పడగానే ఆయన పార్టీ జేఎంఎం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది.

అయితే సొంతానికి గనులు కేటాయించుకున్న వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటుకు రంగం సిద్దం కాగా ఇప్పటికే ఈసీ నుంచి వచ్చిన సిఫార్సుల్ని ఆమోదించి గవర్నర్ తిరిగి ఈసీకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో ఈసీ సోరెన్ పై అనర్హత వేటువేస్తూ ఏ క్షణాన అయినా నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

ఇక హేమంత్ పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసే అంశం ప్రస్తుతం గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

గవర్నర్ గనుక అనర్హత వేటు వేస్తే హేమంత్ ముఖ్యమంత్రిగా తప్పుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు.

హేమంత్ భార్య క‌ల్ప‌నా.?ఇక హేమంత్ గ‌న‌క త‌ప్పుకుంటే ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి ఆయన వారసులు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే కొందరి పేర్లు చర్చకు వస్తున్నా ఎక్కువగా హేమంత్ భార్య కల్పనా సోరేన్ కే అవకాశాలున్నట్లు అర్థ‌మవుతోంది.

అయితే ఇప్పటివరకు కల్పన ప్రత్యక్షంగా ఎక్కడా రాజకీయాల్లో కనబడలేదు.ఇంటికి మాత్రమే పరిమితమైన కల్పన రేపు జార్ఖండ్ పగ్గాలు పట్టాల్సిన అవసరం రావచ్చు.

ఇక తండ్రి శిబూసొరేన్ ఉన్నప్పటికీ ఈయనపై ఇప్పటికే అనేక కేసులున్నాయి.మర్డర్ కేసులో ఇప్పటికే కొంతకాలం జైలుకి వెళ్లారు కూడా.

ఇక అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి.కాబట్టి తండ్రి సీఎం సీటులో కూర్చునే అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి.

"""/"/ మ‌రోవైపు హేమంత్ తల్లి రూపీసోరేన్ పేరు కూడా వినిపిస్తోంది.అయితే భార్య ఉండగా హేమంత్ తల్లికి పగ్గాలు అప్పగించరని కొంద‌రి వాద‌న‌.

పైగా తల్లి ఇప్పటివరకు రాజకీయాల్లో ఎక్కడా కనబడలేదు.అలాగే కల్పన కూడా కనబడకపోయినా కొన్ని అధికారిక కార్యక్రమాల్లో హేమంత్ తో కలిసి కల్పన పాల్గొన్న సందర్భాలున్నాయి.

ఇక హేమంత్ అన్న దుర్దాసోరెన్ భార్య‌ సీతా సోరేన్ నేప‌థ్యం చూసుకుంటే నిజానికి హేమంత్ స్ధానంలో దుర్గాయే పార్టీపగ్గాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాల్సింది.

కాకపోతే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ చనిపోవటంతో శిబు వారసునిగా హేమంత్ తెర‌పైకివ‌చ్చారు.పెద్దకొడుకు దుర్గా చనిపోవటంతో ఆయన భార్య సీతాసోనేన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

అయితే ఈమెకు రాజకీయాలంటే బాగానే ఆసక్తుంది.ప్రస్తుతం జామా నియోజవకర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

కూతురు అంజలీ సోరేన్ ఉన్నప్పటికీ వివాహం తర్వాత ఒడిస్సా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

సో క‌ల్ప‌నా పగ్గాలు చేప‌ట్టే ఈవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు.