షర్మిల ఎక్కువ ఊహించుకుంటున్నారా ?
TeluguStop.com
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) నేడు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు .
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు( AP Congress President ) షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది.
ఏపీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ చతికలబడం తో షర్మిల ద్వారా పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది.
అయితే షర్మిల ప్రభావం ఎంతవరకు పని చేస్తుందనేది క్లారిటీ లేనప్పటికీ, మరికొద్ది నెలలోనే ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.
షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అని దానిపైన అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే షర్మిల రాజకీయ వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపుతామని, అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ముందుగా షర్మిల ప్రకటించారు.
తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ కు( Congress Party ) మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.
అయితే ఆమె పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం, తాను ముందు నుంచి పోటీ చేయాలని భావించిన పాలేరు నియోజకవర్గంలోనూ( Paleru Constituency ) తాను పోటీ చేస్తే ఘోర ఓటమి తప్పదనే సర్వే నివేదికలతో షర్మిల వెనక్కి తగ్గారు.
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.అయితే ఇప్పుడు షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేందుకు తానే కారణమని, 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి తాను ఎన్నికలలో పోటీ చేయకపోవడమే కారణమని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం ఇష్టం ఇష్టం లేకనే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లుగా షర్మిల చెబుతున్నారు.
"""/" /
తమ పార్టీ చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ గుర్తించే, తమను కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు షర్మిల చెబుతున్నారు.
అయితే షర్మిల చెబుతున్న ఈ మాటలపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.షర్మిల ప్రభావం తెలంగాణలో ఏమాత్రం లేదని ,అసలు ఆమె పార్టీ తరఫు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణమే జరగలేదని, అటువంటిప్పుడు షర్మిల కారణంగానే కాంగ్రెస్ గెలిచింది అనడం హాస్యస్పదమంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.
వాస్తవంగా షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.
"""/" /
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్( DK Shiva Kumar ) ద్వారా ఈ ప్రయత్నాలు చేసినా, తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, కాంగ్రెస్ షర్మిలను దూరంగానే ఉంచింది.
ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో, షర్మిల ను ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ చేసి, కనీసం రాయలసీమ ప్రాంతంలోనైనా కాంగ్రెస్ తన ఉనికి చాటుకోవాలని చూస్తోంది.
కానీ షర్మిల మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేందుకు తానే కారణం కాబట్టే ,తనకు పెద్దపీట వేస్తున్నారనే భ్రమ లో ఉన్నారు.
పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?