ఆ పార్టీపై షర్మిల కక్ష తీర్చుకోబోతున్నారా ? 

తెలంగాణలో వైఎస్సార్ ( YSR Telangana Party ) తెలంగాణ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా,  ఆ పార్టీ అధినేత షర్మిల మాత్రం ధీమాగానే ఉన్నారు.

తాను పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.ముందుగా రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గల్లోనూ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబడతామని షర్మిల ప్రకటించినా, చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు దొరకకపోవడంతో , ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

  తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరూ లేకపోయినా , పాలేరు నుంచి తాను పోటీ చేసి సత్తా చాటుకుంటాను అని   ప్రకటించారు.

"""/" / అయితే ఇప్పుడు ఆ వ్యూహాన్ని షర్మిల ( Ys Sharmila )మార్చుకున్నారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని( YSR Telangana Party ) కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు దాదాపు అంతా సిద్ధమైనా,  చివర నిమిషంలో కాంగ్రెస్ కు  చెందిన కీలక నేతలు కొంతమంది అడ్డుపడి విలీన ప్రక్రియను ముందుకు వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు .

దీంతో షర్మిల ఒంటరిగా మిగిలిపోయారు.అందుకే వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం కాకుండా అడ్డుకున్న కొంతమంది నేతలే టార్గెట్ గా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు షర్మిల పావులు కదుపుతున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం కాకుండా అడ్డుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తో పాటు మరి కొంతమంది కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గల్లో బలమైన అభ్యర్థులను తమ పార్టీ తరపున పోటీకి దించాలని షర్మిల నిర్ణయించుకున్నారు.

తాను పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను షర్మిల ప్రకటించారు.

"""/" / దీంతో తాను కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసినా,  పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) భావించడంతోనే ఆయన తమ పార్టీ విలీన ప్రక్రియను అడ్డుకున్నారని షర్మిల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే పాలేరు తో పాటు మరికొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించి,  కాంగ్రెస్ ఓట్లలో చీలిక తెచ్చి కాంగ్రెస్ కు,  తనను వ్యతిరేకించిన నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారట.

పరోక్షంగా షర్మిల బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసేందుకే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

నేను ఈ రోజు ఇంత డ్యాన్స్ చేయడానికి కారణం మా అమ్మే : సాయి పల్లవి