అజ్ఞాతంలో 'సండ్ర'..? 'కారు' ఎక్కే ముహూర్తం దగ్గరకి వచ్చేసిందా ...?

తెలంగాణ లో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తమ ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ఆ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నా.ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మెల్యే లకు గేలం వెయ్యడం .

ఏదో ఒకరకంగా వారిని పార్టీలోకి తీసుకొచ్చి తమకు ఎదురే లేకుండా చేసుకోవాలని చూస్తుండడం ఆయా పార్టీలకు కలవరం పుట్టిస్తోంది.

ఇప్పటికే కేసీఆర్ మీద పోటీ చేసి ఆయనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఒంటేరు ప్రతాపరెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చి అందరికి షాక్ ఇచ్చారు కేసీఆర్.

అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు డజను మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.

రేపో మాపో తమ పార్టీలో చేరిపోతారని టీఆర్ఎస్ లీకులు ఇస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీనే.

ఆ పార్టీ పేరుచెప్తే చాలు టీఆర్ఎస్ కారాలు మిరియాలు నూరేస్తుంది.ఎలా అయినా ఆ పార్టీని తెలంగాణాలో లేకుండా చేయాలనీ కేసీఆర్ చూస్తున్నాడు.

దానిలో భాగంగానే తెలంగాణాలో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరినీ కారెక్కించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ.వస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పార్టీ మారాలంటూ అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు.

మంత్రి పదవితో పాటు .ఇంకా అనేక ఆఫర్లు కూడా గులాభీ పార్టీ నుంచి వచ్చాయి.

అయితే ఆయన మాత్రం టీడీపీని వీడేది లేదు అంటూ మొన్నటివరకు ప్రకటించారు.అయితే ఇప్పుడు సండ్ర లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది.

అలాగే ఈయనతో పాటు అశ్వారావు పేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు కూడా కారెక్కేందుకు సిద్ధం అయినట్టుగా కనిపిస్తున్నాయి పరిస్థితులు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అయితే .

ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది! కనీసం ఫోన్ లైన్లో కూడా అందుబాటులో లేకుండా సీక్రెట్ ప్లేస్ లో ఉన్నారట.

గురువారం రాత్రే ఆయన సత్తుపల్లి నుంచి హైదరాబాద్ వచ్చినట్టు స్థానికంగా ప్రచారం సాగింది.

కానీ.ఈయన హైదరాబాద్ చేరుకోలేదనీ, సత్తుపల్లిలో కూడా లేరని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.

ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు కొంత సస్పెన్స్ గా మారింది.అలాగే సండ్ర ఇంకా తెలుగుదేశం శాసన సభ్యుడిగా ప్రమాణం కూడా చెయ్యలేదు.

అసెంబ్లీకి ఆయన గైర్హాజరు అవుతున్నారు.ఇదంతా పార్టీ మారే ఉద్దేశంతోనే అనే వాదనలు కూడా బయలుదేరాయి.

ఇక మచ్చ నాగేశ్వర రావు విషయంలోనూ ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది.అయన కూడా సండ్ర బాటలోనే ఉన్నారట.

వీరిద్దరూ రేపో మాపో కారు ఎక్కడం ఖాయం అన్నట్టుగా.శరవేగంగా పరిణామాలు మారిపోయాయి.

నా భర్తను అన్నా అని పిలిచేదానిని.. వైరల్ అవుతున్న బర్రెలక్క షాకింగ్ కామెంట్స్!