విడాకుల లొల్లికి సమంతా తీరే కారణమా?

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సమంతా, నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు డైలీ సీరియల్ లా మారింది.ఇంతకీ వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారా? లేదా? అనేది బయటకు తెలియదు.

ఏదో విషయం సమంతా లేదంటే నాగచైతన్య చెప్తే బాగుంటుంది.కానీ ఇద్దరూ దాగుడు మూతలు ఆడ్డంతో మీడియా తనకు తోచినట్లు వార్తలు అల్లుతోంది.

సమంత, నాగ చైతన్య కు సంబంధించి గడిచిన కొంత కాలంగా పలు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు.అంతేకాదు.

ఈ వార్తలు ఇలా రావడానికి కారణం కూడా సమంతా అనే చెప్పాలి.ఈ విషయంపై చైతన్య ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు.

తను ఎప్పటిలాగే ఉంటున్నాడు.సమంతా మాత్రమే ఈ ఊహాగానాలకు కారణం అవుతుంది.

సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెట్టడం, ఆ తర్వాత దాన్ని డెలిట్ చేయడం, అనవసర చర్చకు దారి తీయడం జరుగుతుంది.

నాగచైతన్య తన సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ చెప్పడు.

కానీ సమంతా అలా కాదు.ఏవేవో పోస్టులు పెడుతూనే ఉంటుంది.

లేని అనుమానాలకు తావిస్తుంది.అవి నిజమేనా అని మీడియా అడిగితే ఒంటికాలుపై లేస్తుంది.

తాజాగా సమంతా ఓ పోస్టు పెట్టింది.నాగ్ మామ అని కాకుండా నాగార్జున అని రాసింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/09/is-samantha-reason-for-all-this-orce-rumors-issuess!--jpg "/ వెంటనే దాన్ని డెలిట్ చేసింది.గతంలో తన పేరు పక్కనున్న అక్కినేనిని ఎత్తివేసింది.

దీంతోనే అక్కినేని ఫ్యామిలీకి కాలినట్లు తెలుస్తోంది.విడాకుల గురించి వివరణ ఇవ్వకపోతే.

సైలెంట్ గా ఉండాలి తప్ప.రెచ్చగొట్టే, అనుమానాలకు తావిచ్చే పోస్టులు పెట్టకూడదు.

కానీ సమంతా అలా ఉండేరకం కాదు కదా.అందుకే ఈ రచ్చ అని సినిమా పరిశ్రమలో టాక్ నడుస్తుంది.

ఇప్పటికైనా తను కాస్త దూకుడు తగ్గించుకుంటే మంచిదనే మాటలు వినిపిస్తున్నాయి.అంతేకాదు.

సోషల్ మీడియాలో అడ్డమైన చెత్త పెట్టడం కంటే సైలెంట్ గా ఉండటం మంచిదంటున్నారు పెద్దలు.

పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్.. వరుడి ఫ్రూటీలో రమ్ము కలిపిన స్నేహితుడు.. తర్వాతేమైందో మీరే చూడండి!