సమంతకి అప్పుడు ఛాన్స్ లు వచ్చేనా? లేదా?

టాలీవుడ్( Tollywood ) తో పాటు పాన్‌ ఇండియా స్థాయి లో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత( Samantha ).

ఈ అమ్మడు సినిమాలతో పాటు సిరీస్‌ లతో కూడా వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటున్న సమయంలో ఏకంగా ఏడాది బ్రేక్‌ కావాలంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంది.

ప్రస్తుతం ఈమె ఏ సినిమా లు చేయడం లేదు.ఏ సినిమా షూటింగ్‌ లో కూడా ఈమె పాల్గొనడం లేదు.

ఈమె నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌( Citadel Web Series ) స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది.

"""/" / ఆ వెబ్‌ సిరీస్ కి సంబంధించిన వారం రోజుల ప్యాచ్ వర్క్ షూటింగ్ లో సమంత పాల్గొనాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇక సమంత కొత్త సినిమా లు ఏమీ క్లారిటీ లేదు, కన్ఫర్మ్‌ అవ్వలేదు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత కోసం రాసుకున్న రెండు కథలు, సమంత తో అనుకున్న సినిమా లు ఇప్పుడు వేరే హీరోయిన్స్ వద్దకు వెళ్లాయి.

సమంత కమర్షియల్‌ హీరోయిన్ గా నటించే అవకాశాలు తక్కువ ఉన్నాయి.లేడీ ఓరియంటెడ్‌ సినిమా లు చేయాలి అంటే మాత్రం ఈమెకు పెద్దగా కథలు వచ్చే అవకాశం లేదు అంటున్నారు.

కనుక సమంత బ్రేక్‌ ను ముగించుకున్న తర్వాత కనీసం ఆఫర్లు వస్తాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఒక వేళ సమంత కనుక ఆఫర్లు దక్కించుకోలేకుంటే ఏదో ఒకటి అన్నట్లుగా హిందీలో వచ్చే సినిమా లు మరియు సిరీస్ లకు ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే కనుక నిజం అయితే తెలుగు లో ఈమె కనిపించే అవకాశాలు తక్కువ అంటున్నారు.

ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న సమంత ముందు ముందు కూడా విశ్రాంతి తీసుకోవాల్సిందేనేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత అనారోగ్య సమస్యల కారణంగా బ్రేక్ తీసుకున్న విషయం అందరికి తెల్సిందే.

ఏకంగా 5 రోజుల పాటు ఎవరికి మొహం చూపించుకోలేక ఇంట్లోనే ఉన్న శోభన్ బాబు..!