దేవర సినిమాకి సైఫ్ అలీ ఖాన్ పాత్ర మైనస్ అవ్వబోతుందా..?
TeluguStop.com
జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర ' సినిమా( Devara ) మీద ప్రేక్షకులకి మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆయన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేసింది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి క్యారెక్టర్ ని ఎదుర్కోవాలంటే విలన్ కూడా అంతటి ఒక దమ్మున్న క్యారెక్టర్ కావాలి.
"""/" /
కాబట్టి సైఫ్ అలీ ఖాన్ ను ఈ సినిమాలో తీసుకున్నట్టుగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు.
కానీ ఈ సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత మాత్రం సైఫ్ అలీ ఖాన్ తప్ప ఆ పాత్రకి ఎవరు సెట్ అవ్వరు అనేంతలా ఇప్పుడు మంచి పేరును సంపాదించుకున్నాడు.
ఇంకా ఈ సినిమాతో ఒక్కసారిగా అటు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా మెప్పించడమే కాకుండా ఇక మీదట కూడా ఆయన భారీ విలన్ గా మారిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పటికి ఆయన అది పురుష్( Adipurush ) సినిమాలో రావణాసురుడి పాత్ర పోషించినప్పటికీ అది ఆయన అంత పెద్ద గుర్తింపైతే తీసుకురాలేదు.
కానీ మాస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాత్రం ఆయన విలనిజం చాలా హైలెట్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
"""/" /
ఇక మొత్తానికైతే ఆయన లాంటి నటుడు ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమాకి కూడా చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక విలన్ గా ఆయన పాత్రను బాగా చూపించారు.కానీ దీనివల్ల సినిమాకి ఏమైన మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఎందుకు అంటే హీరో పాత్ర విలన్ పాత్ర కంటే చాలా గొప్పగా ఉండాలి.
ఇక అలా కాకుండా విలన్ ని స్ట్రాంగ్ గా చూపించి హీరోని నార్మల్ గా చూపిస్తే మాత్రం అది వర్కౌట్ అవ్వదు.
గేమ్ ఛేంజర్ లీక్ వెనుక ఉన్నది వాళ్లేనా.. అడిగిన డబ్బు ఇవ్వలేదనే అలా చేశారా?