రేవంత్ రెడ్డి అంత సాహసం చేయబోతున్నారా ? 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపించాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )ఉంది .

ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో , పూర్తిగా ఎన్నికల వ్యూహాల్లో కాంగ్రెస్ నిమగ్నం అయ్యింది.

  కాంగ్రెస్ అగ్రనేతల నుంచి , రాష్ట్రస్థాయి నాయకులు వరకు అంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు .

అధికార పార్టీ బీఆర్ ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ అని వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

ముఖ్యంగా బీఆర్ ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్( CM Kcr ) రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

  గజ్వేల్ , కామారెడ్డి నుంచి ఆయన పోటీ చేయబోతుండడంతో , కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని పోటీకి దించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.

ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గం నుంచి కెసిఆర్ పోటీ చేస్తున్నారు .</b """/" / అక్కడ బిజెపి తమ పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ( Etela Rajender )ను నిర్ణయించింది.

  దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీకి దిగితే రెండు చోట్ల కెసిఆర్ కు ఓటమి తప్పదు అని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

  తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి మంచి గ్రాఫ్ ఉండడంతో,  కామారెడ్డిలో కేసీఆర్ పై  రేవంత్ రెడ్డి తప్పకుండా గెలుస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.

ఇప్పటికే కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ నేత షబ్బీర్ అలీ పేరును ప్రకటించారు .

ఒకవేళ రేవంత్ రెడ్డిని పోటీకి దించడం ఖాయం అయితే,  షబ్బీర్ అలీ పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారట.

దీనికి తోడు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు టీం కూడా కామారెడ్డిలో సర్వే నిర్వహించిందట.

  కెసిఆర్ పై రేవంత్ రెడ్డి అయితే గట్టి పోటీ అవుతాడని సునీల్ కానుగోలు టీం తేల్చి చెప్పిందట.

"""/" / కామారెడ్డిలో తాను గెలిచినా,  రాజీనామా చేస్తానని గజ్వేల్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తానని గతంలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.

  రాజీనామా చేసి ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

  గత ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) అభ్యర్థి గంప గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ మీద కేవలం 5000 ఓట్ల తేడాతో గెలిచారు.

అయితే గంప గోవర్ధన్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో , కామారెడ్డిలో తానే పోటీ చేయాలని కేసిఆర్ డిసైడ్ అయ్యారు.

కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో షబ్బీర్ అలీ కంటే రేవంత్ రెడ్డిని పోటీకి దించితేనే కెసిఆర్ ను ఓడించగలమనే ధీమాతో కాంగ్రెస్ ఉందట.

దీంతో కొడంగల్ కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మలబద్ధకం వేధిస్తుందా.. క్యారెట్ తో సమస్యను తరిమికొట్టండిలా!