కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డే ముప్పా ?
TeluguStop.com
ఈ ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తెగ పరితపిస్తోంది.
ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు హస్తం నేతలు.
పార్టీలోని నేతల మద్య అంతర్గత విభేదాలను పక్కన పెట్టి అందరూ ఒకే తాటిపైకి వచ్చి పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక వచ్చే నెల 30 న పోలింగ్ జరగనుండగా ఇప్పటికే తొలి జాబితా అభ్యర్థులను కూడా విడుదల చేసింది హస్తం పార్టీ.
ఇక ఈ రెండు మూడు రోజుల్లో రెండో జాబితాను కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
"""/" /
కాగా సీట్ల కేటాయింపులో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం పార్టీని కొంత కలవర పెట్టె అంశం.
ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( TPCC Chief Revanth Reddy ) కనుసైగల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీలోని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేసున్నారు.
అర్హత ఉన్నవారికి సీట్ల కేటాయింపు జరపకుండా రేవంత్ రెడ్డి సీట్లను అమ్ముకుంటున్నారని సొంత పార్టీ నేతలే గగ్గోలు పెడుతున్నారు.
ఈ విషయంపై ఇటీవల కొంతమంది నేతలు ఎన్నికల కమిషన్ కు( Election Commission ) కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి అసలేంచేస్తున్నారనే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.
"""/" /
మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై పార్టీలోని మెజారిటీ నేతలు వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు.
రేవంత్ రెడ్డి వైఖరి కారణంగా ఇప్పటికే చాలమంది నేతలు కాంగ్రెస్ వీడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ బాద్యతలను గుడ్డిగా రేవంత్ రెడ్డికి అప్పగించి అధిష్టానం తప్పుచేసిందా అనే సందేహాలు కొంతమంది నేతల్లో వ్యక్తమౌతున్నాయి.
గతంలో టీడీపీలో ( TDP ) ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆ పార్టీ బలహీన పడడానికి ఆయనే కరణమనే వాదన ఇప్పటికీ అడపా దడపా వినిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా ఆయన అదే పరిస్థితికి తీసుకొస్తారా ? అనే భయం పార్టీ సీనియర్ నేతల్లో ఉందట.
ఏది ఏమైనప్పటికి ఎన్నికల ముందు మరోసారి రేవంత్ రెడ్డి విషయంలో అంతర్గత విభేదాలు బయట పడుతుండడం ఆ పార్టీని కొంత కలవరపెట్టె అంశం.
ఎన్టీఆర్ జాగ్రత్త పడితే అల్లు అర్జున్ బుక్కయ్యారా.. వివాదం విషయంలో ట్విస్టులివే!