ప్రవీణ్ కుమార్ విజయం ఖాయమా ? ఏనుగు పార్టీ బలమెంత ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది .

హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అంచనాలు ఉన్నాయి.హంగ్ ఏర్పడితే చిన్నచితకా పార్టీలకు మంచి డిమాండ్ ఏర్పడబోతోంది.

ఇదే విధంగా తెలంగాణలో ఇటీవల కాలంలో కాస్త బలోపేతం అయినట్లుగా కనిపిస్తున్న బి.

ఎస్.పి పార్టీకి అది కలిసొచ్చే అవకాశం ఉంది .

ముఖ్యంగా తెలంగాణ బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) ప్రభావం తెలంగాణలో కచ్చితంగా కనిపించనుంది.

జాతీయ పార్టీ బీఎస్పీ( BSP PARTY ) తరఫున తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దించారు.

బీఎస్పీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపించలేకపోయినా , కొన్నిచోట్ల మాత్రం ప్రధాన పార్టీ అభ్యర్థులకు టెన్షన్ కలిగించే అవకాశం కనిపిస్తోంది.

"""/" / కొన్ని స్థానాల్లో బీఎస్పీ తరఫున బలమైన అభ్యర్థులు ఉండడంతో గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది .

ఐదు విడతలుగా 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించారు.బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

ఆయన కూడా సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు .అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విస్తృతంగా పరిచయాలు ఉండడం , ఆయన మాజీ పోలీస్ అధికారి కావడం, 1995 ఐపీఎస్ ఆఫీసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడం, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల కార్యదర్శి గా సుదీర్ఘకాలం పనిచేయడం , తన ఉద్యోగానికి రాజీనామా బీ ఎస్ పీ చేరి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

"""/" /  సిర్పూర్ నియోజకవర్గం( Sirpur Assembly Constituency ) లో ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి.

  ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప ఉన్నారు.రెండుసార్లు వరుసగా గెలిచిన కోనప్ప హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

  2014లో బీ ఎస్పీ నుంచి కోనప్ప పోటీ చేసి విజయం సాధించారు.

దీంతో ఇక్కడ పార్టీకి ఆదరణ ఉందనే విషయం అర్ధం అవుతుంది .అందుకే బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది .

ఇది కూడా ప్రవీణ్ కుమార్ కు కలిసి రాబోతోంది.

దోషిగా తేల్చిన కోర్ట్ : ట్రంప్‌పై సానుభూతి, విరాళాలిచ్చేందుకు ఎగబడ్డ అమెరికన్లు .. పేజీ క్రాష్