ప్రభాస్ ‘కల్కి’ చిత్రాన్ని వదులుకున్న మోస్ట్ అన్ లక్కీ టాలీవుడ్ హీరో అతనేనా..?

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియన్ మూవీస్ లో ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ప్రభాస్( Prabhas ) హీరో గా నటిస్తున్న 'కల్కి 2898 AD( Kalki 2898 AD )'.

పీరియడ్ మరియు సైన్స్ ఫిక్షన్ ని జత పరిచి తెరకెక్కిస్తున్న ఈ సూపర్ హీరో మూవీ పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.శ్రీ మహావిష్ణవు 11 వ అవతారం కల్కి 2898 వ సంవత్సరం లో ఉంటాడని.

అతన్ని ప్రస్తుతం కాలం లోకి కొన్ని అనుకోని సంఘటనల కారణం గా సైంటిస్ట్స్ తీసుకొస్తారని, ఆ ప్రక్రియ పేరే ప్రాజెక్ట్ కె అనేది ఈ సినిమా స్టోరీ లైన్.

ఈ చిత్రం లో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

"""/" / వీరితో పాటు అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్ మరియు దిషా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కమల్ హాసన్( Kamal Haasan ) కి సంబంధించిన షూటింగ్ పార్ట్ తప్ప, మిగిలిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందని, వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మహానటి చిత్రం కంటే ముందుగా తియ్యాలి అనుకున్నాడట డైరెక్టర్ నాగ అశ్విన్.

ఈ సినిమా తియ్యాలని అనుకున్నప్పుడు ఆయన మైండ్ లో ఉన్న హీరో ప్రభాస్ కాదట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అట.ఎప్పుడో ఆరేళ్ళ క్రితం సినిమాల్లో రావాలి అని అనుకుంటున్నప్పుడు రామ్ చరణ్ ని కలిసి ఈ స్టోరీ ని వినిపించాడట నాగ అశ్విన్.

స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంది, కానీ మొదటి సినిమానే ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ ని నీ భుజాల మీద మొయ్యగలవా?, ఇప్పుడే వద్దులే ఒక రెండు మూడు సినిమాలైనా తీసి రా అని రామ్ చరణ్ అన్నాడట.

"""/" / ఆ తర్వాత నాగ అశ్విన్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని 'మహానటి' సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు.

ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన ఇదే స్క్రిప్ట్ ని తీసుకెళ్లి ప్రభాస్ కి వివరించగా, అతను కేవలం సింగల్ సిట్టింగ్ లోనే ఓకే చేసి డేట్స్ ఇచ్చేసాడు.

అలా ప్రారంభమైన ఈ సినిమా చివరికి ఇక్కడి దాకా చేరుకుంది.ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అనిపిస్తున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు.

వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?