భక్త కన్నప్ప సినిమా లో ప్రభాస్ నిజంగానే నటిస్తున్నాడా..?
TeluguStop.com
మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప అనే సినిమా వస్తుంది.ఇక ఇందులో శివుడి పాత్రలో ప్రభాస్ నటించబోతున్నాడు అంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.నిజానికి ప్రభాస్ మంచు విష్ణు( Vishnu Manchu ) సినిమాలో నటించడం అతని అభిమానులకు పెద్దగా నచ్చడం లేదు.
ఎందుకంటే మంచు వాళ్ళతో సినిమా అంటే అది కాంట్రవర్సీతో కూడుకొని ఉంటుంది.ఒక వేళ కాంట్రవర్సీ అవ్వకపోయిన కూడా వాళ్ళు పక్క వాళ్ల కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్లతో సినిమా చేయడం కంటే కామ్ గా కూర్చొని ఉండటం మేలు అని చాలా మంది అంటూ ఉంటారు.
"""/" /
ఇక ఇప్పుడు ప్రభాస్( Prabhas ) ఆయన సినిమాలో నటిస్తున్నాడు అని తెలియగానే ప్రభాస్ అభిమానులు తీవ్రమైన ఆందోళన లో ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా మంచు విష్ణు స్పందిస్తూ తన సినిమాలో ప్రభాస్ పాత్రను రివిల్ చేస్తున్నాను అంటూ కొన్ని మాటలు చెప్పడం ప్రభాస్ అభిమానుల్లో తీవ్రమైన ఆందోళనను కలిగిస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్ నిజంగానే నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం పది రోజుల డేట్స్ ని కూడా కేటాయించినట్లుగా తెలుస్తుంది.
ఇక ఈయన పాత్ర కూడా ఈ సినిమాకి చాలా కీలకంగా మారబోతోందా. """/" /
మంచు వాళ్ళు చేసే సినిమాలో ప్రభాస్ ఎంతవరకు మంచి పేరు సంపాదించుకుంటాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే రాజ సాబ్( Raja Saab ), కల్కి, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీ గా ఉన్నాడు.
ఇందులో రాజసాబ్, కల్కి ఈ సంవత్సరం థియేటర్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉసిరి గింజలను పారేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలిస్తే షాకైపోతారు!