'కారు ' దిగాలని పొంగులేటి ఫిక్స్ అయ్యారుగా ? ఆ వేడుకతో క్లారిటీ ?
TeluguStop.com
ఖమ్మం జిల్లా రాజకీయల్లో అతి కొద్దికాలంలోనే కీలక నేతగా ఎదిగారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
బడా పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
అన్ని పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ తన రాజకీయ ఎదుగుదలకు పునాదులు వేసుకున్నారు.
ఏపీ తెలంగాణ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు .
అంతేకాకుండా తన పార్లమెంటు నియోజకవర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని తన సత్తా చాటుకున్నారు.
ఆ తరువాత తెలంగాణలో వైసిపి ప్రభావం తగ్గడం పూర్తిగా ఏపీ రాజకీయాలపై జగన్ దృష్టి పెట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు.
మొదట్లో ఆయనకు బాగానే ప్రాధాన్యం దక్కినా, ఆ తరువాత గ్రూపు రాజకీయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు.
ముఖ్యంగా టిఆర్ఎస్ కీలక నేతలు కొంతమంది తనను దూరం పెడుతూ, కావాలనే ఇబ్బందులు సృష్టిస్తున్నారనే అభిప్రాయంతో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తారని శ్రీనివాస్ రెడ్డి బాగా ఆశలు పెట్టుకున్నా, ఆయనకు అవకాశం దక్కకపోవడంతో మరింతగా అసంతృప్తి ఆయనలో పెరిగింది .
ఈ క్రమంలోనే ఆయన బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది.దీనికి మరింత బలం చేకూర్చేలా ఇటీవల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక హైదరాబాదులో ఘనంగా నిర్వహించడం, ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరు కావడంతో శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు విషయం మరోసారి చర్చనీయాంశం అయింది.
"""/"/
ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , టిఆర్ఎస్ కీలక నేత మంత్రి హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇలా చాలామంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ తో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడడం, అలాగే మిగతా బిజెపి నాయకులతోనూ సఖ్యతగా మెలగడం వంటి వ్యవహారాలతో శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
త్వరలోనే ఆయన బిజెపి కండువా కప్పుకుంటారని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోవడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది.
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన సింహం.. తర్వాతేమైందో చూడండి..