పిఠాపురం వర్మ ఆ బాధలో ఉన్నారా ? 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ( Pithapuram Constituency )నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేసి విజయం సాధించారు అయితే అక్కడ టిడిపి తమ అభ్యర్థిగా మునుగా వర్మను ప్రకటించినా పవన్ కోసం వర్మ ఆ సీటును త్యాగం చేయడమే కాకుండా,  గెలిపించే బాధ్యతలను తీసుకుని  ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు.

  ఇక పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వర్మ పై ప్రశంసలు కురిపించారు.

వర్మ వల్లే తన విజయం సాధ్యమైందని,  తన విజయాన్ని వర్మకు అంకితం ఇస్తున్నానంటూ ప్రకటించారు.

  ఇక అన్ని విషయాల్లోనూ కలిసే ముందుకు వెళ్తామని పవన్ ప్రకటించారు.ఇక ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )సానుకూలంగా నే ఉంటూ వచ్చారు .

వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ప్రకటించారు.  అయితే అవేవి కార్యరూపం దాల్చలేదు.

  ఇక వర్మ కు అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని టిడిపి క్యాడర్ అసంతృప్తితో ఉందట.

రెండు పార్టీల అధినాయకత్వాలు కలిసే ఉన్నా.పిఠాపురంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదట.

"""/" / ఈ పరిణామాలపై వర్మ( Verma ) మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు.

ఇప్పటికే అనేక సందర్భాల్లో బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కరు.అలాగే స్థానికంగా కాకినాడ జనసేన ఎంపీ తో వర్మకు దూరం పెరిగిందనే ప్రచారము జరుగుతోంది.

  అయితే ఎప్పటికప్పుడు టిడిపి , జనసేన ( TDP, Jana Sena )అధిష్టానాలు నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి పనిచేసుకోవాలి అని సూచిస్తున్నా.

తమకు సరైన గుర్తింపు లభించడం లేదని టిడిపి క్యారెక్టర్ అసంతృప్తితో ఉంది.ముఖ్యంగా వర్మను అధికారిక కార్యక్రమాలకు దూరం పెట్టడం,  పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై వర్మ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు.

"""/" / పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రతి సమయంలోను వర్మ హాజరవుతున్నారు.

కానీ జనసేన నేతలు మాత్రం ఆ స్థాయిలో వర్మకు గుర్తింపు ఇవ్వడం లేదని వర్మ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  జనసేన స్థానికంగా నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు వర్మ ను ఆహ్వానించడం లేదట .

వర్మ మాజీ ఎమ్మెల్యే కావడంతో,  స్థానికంగా ఉన్న పరిచయాలు,  అధికారుల వద్ద ఉన్న గుర్తింపుతో నియోజకవర్గాల్లోని సమస్యలు,  వివిధ అంశాలపై చర్చిస్తున్నారట.

అయితే ఈ వ్యవహారం జనసేన నాయకులకు నచ్చడం లేదట.ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ బిజీగా ఉండడంతో నియోజకవర్గ వ్యవహారాలను వర్మ పర్యవేక్షిస్తున్నారు.

అయితే ఇది జనసేన స్థానిక నాయకులకు నచ్చడం లేదట.ఒకవైపు జనసేన, మరోవైపు టిడిపి నాయకులు నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు ఎవరి మాట వినాలనే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.

ఈ పరిణామాల నేపథ్యంలో వర్మ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతోంది.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?