‘ పిన్నెల్లి ‘ కి శిక్ష తప్పదా ? ఆ ఘటనపై ఈసీ సీరియస్
TeluguStop.com
పల్నాడు లోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం లో చోటు చేసుకున్న వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపుతోంది.
వైసీపీ కి చెందిన పల్నాడు జిల్లా, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna Reddy )చిక్కుల్లో పడినట్టుగానే కనిపిస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది .
ఆయనపై కఠిన చర్యలకు సిఫార్సు చేసింది.ఈనెల 13న పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు.
ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది రికార్డు అయింది.దీనికి సంబంధించిన వీడియో రికార్డ్స్ తాజాగా వెలుగులోకి రావడం, సోషల్ మీడియాలోనూ ఇవి వైరల్ గా మారాయి.
"""/" /
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి దూసుకురావడం, నేరుగా ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎం ను నేలకేసి కొట్టడం ఆ వీడియోలో నమోదయింది.
టిడిపి నాయకులు.కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నందువల్లే ఆ ఈవీఎం( EVM ) ను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయితే ఈవీఎం మిషన్ ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది.దీనిపై సమగ్ర నివేదికను ఇప్పటికే కోరింది.
ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena) ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రికార్డును ఎన్నికల సంఘానికి పంపించారు.
దీంట్లో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. """/" /
దీనిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం డిజిపి కి సిఫార్సు చేసింది.
ఇప్పటికే హైదరాబాద్ కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లిపోయారు.దీంతో ఆయన పరారీలో ఉన్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాను ఎక్కడికి పారిపోలేదని, అవసరమైతే రెండు గంటల్లో మాచర్లకు వస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈసీ సిఫార్సుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై డిజిపి ఏం చర్యలు తీసుకుంటారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
భర్త అఫైర్ పెట్టుకున్నాడని అందరి ముందే పరువు తీసేసిన భార్య.. వీడియో వైరల్..