పీరియడ్స్ సమయంలో ఫిజికల్ రిలేషన్ మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

పీరియడ్స్ సమయంలో మహిళల శరీరంలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి.చాలామంది మహిళలు నీరసం, అలసట, నొప్పి తదితర సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అయితే పీరియడ్స్ సమయంలో శరీరక సంబంధాలు కలిగి ఉండడం మంచిదేనా అనే ప్రశ్న చాలా మంది మహిళల మనసులో ఎప్పుడు వస్తూ ఉంటుంది.

వివాహితులు తరచూ ఈ రకమైన ప్రశ్నతో ఇబ్బంది పడుతూ ఉంటారు.రుతుక్రమం సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల ప్రయోజనాలు, నష్టాలు రెండు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నష్టాల గురించి తెలుసుకుందాం.

ఎందుకంటే అనారోగ్య సమస్యలు వస్తే మాత్రం తీవ్ర ఇబ్బంది పడాల్సి ఉంటుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం ఋతుక్రమం సమయంలో సెక్స్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో శరీరక సంబంధం పెట్టుకోవడం వల్ల యోని పీహెచ్ స్థాయి పెరుగుతుంది.

ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.పీరియడ్స్ సమయంలో శరీరక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మహిళల్లో హెచ్ఐవి వంటి లైంగిక వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

"""/"/ ఇప్పుడు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.నిపుణుల అభిప్రాయం ప్రకారం ఋతుక్రమ సమయంలో శరీరక సంబంధం పెట్టుకోవడం వల్ల మైగ్రేన్, తలనొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడం లో సహాయపడుతుంది.

పీరియడ్స్ సమయంలో శరీరక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వెన్నునొప్పి, కడుపునొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యల నుంచి మహిళలు ఉపశమనం పొందే అవకాశం ఉంది.

పీరియడ్స్ సమయంలో శరీరక సంబంధం పెట్టుకోవడం వల్ల మహిళలలో ఎండార్పిన హార్మోన్ విడుదలవుతుంది.

ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి పనిచేస్తుంది.

ఋతుక్రమం సమయంలో శరీరక సంబంధం పెట్టుకోవడం వల్ల పీరియడ్స్ క్రమం కాలపరిమితి తక్కువగా ఉంటుంది.

ఇవన్నీ ఏమో కానీ ముందుగా దంపతుల ఇద్దరి మధ్య సరైన అవగాహన ఇష్టం ఉంటేనే ఇలా చేయడం మంచిది.

జగన్ తిరుమల పర్యటన… జనసేన దూరం