పవన్ మద్దతు వ్యూహాత్మక మేనా? లేక చారిత్రక తప్పిదమా ?

నిజానికి రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవంటారు .ఒక రాజకీయ పార్టీగా తాము తీసుకునే నిర్ణయాలు, వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకునే నేర్పు , సమయం చూసి వ్యూహాలను అమలుపరిచే సమర్థతను బట్టి ఒక రాజకీయ పార్టీ బవిష్యత్తు ఆదారపడి ఉంటుంది.

చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తర్వాత పవన్ వ్యవహార శైలి చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తర్వాత హుటాహుటిన ఆంధ్రకు రావాలనుకోవడం, అనుకున్నదే తడవుగా విమానానికి అనుమతులు రాకపోయినా కూడా రోడ్డు మార్గాన్న బయలుదేరడం దాంతో తమ నాయకుడి కోసం కార్య కర్తలు అభిమానులు రోడ్డెక్కడం , ఎక్కడి కక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, పోలీసులకు జనసైనికుల మధ్య ఒక యుద్ధ వాతావరణం పవన్ ప్రయాణం వల్ల కలిగినది అన్నది సుస్పష్టం.

"""/" / ఒక మిత్రపక్షం అధినేతను అరెస్టు చేస్తే పవన్ చూపించిన ఆత్రుత పవన్ పై అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చిందని చెప్పవచ్చు .

అంతేకాకుండా పవన్ వ్యవహార శైలి కొంతమంది హార్డ్ కోర్ జన సేన అభిమానులకు కూడా కొంత ఇబ్బంది కలిగించిందని చెప్పవచ్చు.

ముందు వెనుకలు ఆలోచించకుండా పూర్తిస్థాయి తెలుగుదేశం నాయకుడిలా పవన్ ప్రవర్తించారు అన్న విమర్శలు వినిపించేలా తమ నాయకుడు అవకాశము ఇచ్చారన్న కోపం జనసైనికులలో కనిపించింది.

"""/" / అయితే దశాబ్దంగా రాజకీయ జీవితంలో ఉన్న పవన్ అంత ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోరని, తెలుగుదేశంతో పొత్తులు కచ్చితంగా ఉంటాయని నమ్మకంతో ఉన్న పవన్ రేపు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేతలు బరిలో( Jana Sena ) ఉన్నప్పుడు తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగాలంటే ఆ పార్టీకి అవసరమైనప్పుడు తామున్నా మన్న నమ్మకం కలిగించినప్పుడే అది జరుగుతుందని, ఇప్పటికీ సామాజిక వర్గ పరంగా రెండు పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నందున వాటిని సరిచేయాలంటే కష్టంలో ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకు వెయ్యాలన్న కోణంలోనే ఆయన ఆలోచించారని, అవసరం ఉన్నప్పుడు నిలబడితేనే రేపుపొత్తుల లో తమ మాట నెగ్గుతుందన్న ముందు చూపుతోనే పవన్( Pawan Kalyan ) ఇలా ప్రవర్తించారంటూ ఒక విశ్లేషణ వినిపిస్తుంది .

అయితే పవను ను బలంగా ఓన్ చేసుకున్న సామాజిక వర్గంలో కొంతమంది మాత్రం ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేసినప్పుడు పవన్ ఇంత వేగంగా స్పందించలేదని ముద్రగడకు చంద్రబాబు చేసిన దానికి ఈ అరెస్ట్ ని ప్రతీ కార్య చర్యగా చూస్తున్న చాలామందికి పవన్ అతివేగం కొంత చిరాకు కలిగించిందన్నది వాస్తవం.

అయితే ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ వైఖరి సరైనదేనని భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ ఇలా వ్యవహరించారంటూ జనసేన వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

మూడేళ్లు మొబైల్ కు దూరంగా ఉంటూ ఐఏఎస్.. నేహా బైద్వాల్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!