సెట్స్ లో ఆ దర్శకుడి చెంప చెళ్లుమనిపించిన పవన్ కళ్యాణ్.. నిజమేనా? 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయినప్పటికీ ఇక తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్.

మరీ ముఖ్యంగా యూత్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ను మ్యాచ్ చేసే హీరో ఇప్పటికీ కూడా లేరు అని చెప్పాలి.

సాధారణంగా హిట్లు వస్తేనే హీరోల అభిమానులు పెరుగుతూ ఉంటారు.కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన క్యారెక్టర్ చూసి అభిమానించడం మొదలు పెడుతూ ఉంటారు అభిమానులు.

అయితే హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన జనసేన పార్టీని స్థాపించారు.

ఇక ఎలాంటి అండ లేకుండా రాజకీయాల్లోకి దిగిన సమయంలో ఆయనకు అండగా నిలబడింది అభిమానులే అని చెప్పాలి.

ఇక అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్.

పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కి విలువ ఇవ్వకుండా అన్నీ తనకి తెలుసు అని భావిస్తూ ఉంటాడని.

ఇక ఆయన నటించే ప్రతి సినిమాలో డైరెక్షన్లో కూడా ఆయన హస్తం ఉంటుందని కామెంట్స్ చేశాడు.

"""/"/ అప్పట్లో కుషి, బద్రి, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో కూడా దర్శకత్వంలో పవన్ కల్యాణ్ వేలు పెట్టారని.

డైరెక్టర్స్ కు ఫ్రీడం ఇవ్వడం మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గర అసాధ్యమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు గీతాకృష్ణ.

అప్పట్లో ఖుషి సినిమా సమయంలో సెట్స్ లో చిత్ర దర్శకుడు ఎస్ జే సూర్య పై పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇక ఈ కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హీరో అన్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు డైరెక్టర్ కి చెప్పటం సహజమే అని అభిమానులు అంటూ ఉండటం గమనార్హం.

దర్శకుడి పై పవన్ కళ్యాణ్ చేసుకోవడం పూర్తిగా అసత్య ప్రచారం అంటున్నారు అభిమానులు.

తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన వెంకటేశ్.. అన్ స్టాపబుల్ ప్రోమోలో ఆ సీక్రెట్స్ రివీల్!