'ఎర్ర' పార్టీలను పవన్ పట్టించుకోరా ...? వారి బాధ ఏంటి ...?

ఎర్ర పార్టీలుగా పిలుచుకునే కమ్యూనిస్టు పార్టీలో పరిస్థితి ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

సొంతంగా గెలిచే అంతా సత్తా ఆ పార్టీలకు లేకపోయినా.హడావిడి మంత్రం గట్టిగానే చేస్తుంటాయి.

ప్రతిసారి ఎన్నికల ముందు ఏదో ఒక పార్టీతో కలిసి ఎన్నికల బరి లోకి వెళ్లడం.

ఆ తరువాత ఆ పార్టీతో తమకు సంబంధం లేదన్నట్లుగా పోరాటాలు చేయడం కమ్యూనిస్టులకు అలవాటయిపోయింది.

ప్రస్తుతం ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు జనసేన పార్టీతో గా ఉంటూ వస్తున్నాయి.ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

అయితే మొదట్లో కమ్యూనిస్టుల దూరం పెడుతూ వచ్చిన పవన్ ఆ తర్వాత వారిని చేరదీసినట్టు కనిపించాడు.

అయితే తాము ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తానంటే మరో బాంబు కూడా పేల్చాడు ఈ విషయంలో పవన్ చెప్తుంది చేస్తుంది కమ్యూనిస్టుల తో పాటు ఎవరికి అర్థం అవ్వలేదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే విధిలేని పరిస్థితుల్లో కమ్యూనిస్టులు పవన్ తోనే తమ రాజకీయ అడుగులు అన్నట్టుగా ప్రస్తుతం జనసేనకు దగ్గరగానే ఉంటూ వస్తున్నారు.

ఈ రెండు పార్టీల మధ్య ఏ విధంగా ఉండబోతుంది అనేది పెద్ద సమస్యగా మారింది.

కమ్యూనిస్టులు మాత్రం తాము కనీసం 30 సీట్లలో పోటీ చేయాలంటూ కలలు కంటున్నారు.

అయితే పవన్ మాత్రం సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం జనసేనలో టికెట్ల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.

టిక్కెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ హడావుడి చేస్తున్నారు.దరఖాస్తులు అంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలను పోటీచేసి పోటీ చేసే వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు.

అన్ని స్థానాల నుంచి పోటీ అంటే మరి కమ్యూనిస్టులు పరిస్థితి ఏమిటి వారికి ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడ ఎక్కడ కేటాయిస్తారు అనే విషయంలో ఇప్పటికీ జనసేన నుంచి క్లారిటీ లేదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఎన్నికల సమయం కూడా ఇంకా ఎంతో కాలం లేదు.

అసలు ఇప్పటికే కమ్యూనిస్టులు జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరగకపోయినా.పొత్తు అయితే కొనసాగుతుందనే విధంగానే ఈ రెండు పార్టీలు నడుచుకుంటున్నాయి.

సీట్ల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా గట్టిగా తెగించి పవన్ ని అడగలేక పోవడానికి కారణం కూడా ఉంది.

ఎందుకంటే.ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ తో కలిసి ముందుకు వెళ్లేందుకు కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగా లేవు.

జనసేన మాత్రమే ఇప్పుడు వారికీ కనిపిస్తున్న ఆప్షన్.అందుకే గట్టిగా మాట్లాడితే పవన్ కు కోపం వస్తుందేమో అని సందేహంలో ఉన్నారు.

అందుకే పవన్ పార్టీ నుంచి అభ్యర్థుల అప్లికేషన్లు తీసుకుంటున్న.మా విషయం తేల్చమని కమ్యూనిస్టు పార్టీలు గట్టిగా నిలదీయలేని పరిస్థితుల్లో ఉన్నారు.

రోజు నైట్ ఈ హోమ్ మేడ్ క్రీమ్ వాడితే స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?