కొత్త బంధమా.. ఎంటిది పవన్ ?
TeluguStop.com
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ ( Pawan Kalayan ) ఏది మాట్లాడిన కూడా.
ఆ వెంటనే వైసీపీ నేతల నుంచి కౌంటర్లు రావడం పరిపాటే అయిపోయింది.గతంలో జనసేనను లైట్ తీసుకున్న వైసీపీ నేతలు.
ఇప్పుడు జనసేననే మా మెయిన్ టార్గెట్ అనేలా వ్యవహరిస్తున్నారు.పవన్ చేసే ప్రతి వ్యాఖ్యాపై కూడా సెటైరికల్ కామెంట్స్ చేస్తూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు వైసీపీ నేతలు.
ప్రస్తుతం ఏపీలోని వైసీపీ నేతలకు మద్య తెలంగాణ బిఆర్‌ఎస్ నేతలకు మద్య విశాఖ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రైవేటీకరణ రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
"""/" /
స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ సైలెంట్ గా ఉందని అందుకే కేసిఆర్( KCR ) చొరవ చూపిస్తున్నారని బిఆర్‌ఎస్ నేతలు చెబుతుంటే.
మా రాష్ట్రంలో చోరువ ఏంటని ఏపీ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇలా ఇరు పార్టీల నేతల మద్య చిలికి చిలికి గాలి వానగా మారినట్లుగా ఒకరినొకరు వ్యక్తిగతంగా ధూషించుకునే వరకు వచ్చాయి.
ఏపీ మంత్రులను ఉద్దేశించి తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తుంటే.మేమేం తక్కువ కాదన్నట్లుగా ప్రతివిమర్శలు చేస్తున్నారు ఏపీ మంత్రులు.
ఇలా హాట్ హాట్ గా సాగుతున్న రాజకీయ వేడిలోకి ఇప్పుడు పవన్ ఎంట్రీ ఇవ్వడం మరింత అగ్గి రాజేస్తోంది.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఏపీ మంత్రులు వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజలపై ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు తనను ఎంతో భాదించాయని పవన్ చెప్పుకొచ్చారు.
"""/" / తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహిరిస్తున్న వైసీపీ మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
దీంతో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.రాజకీయ లబ్ది కోసమే పవన్ తెలంగాణపై ప్రేమ ఒలకబోస్తున్నారని, తెలంగాణలో వ్యాపారాల కోసమే అక్కడి మంత్రులకు పవన్ సపోర్ట్ గా నిలుస్తున్నారని మాజీ మంత్రి పెర్ని నాని( Perni Nani ) విమర్శిచారు.
"""/" / పవన్ కొత్త బంధం ఏర్పరచుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని కొత్త చర్చకు తావిచ్చారు పేర్ని నాని, గత కొన్నాళ్లుగా బిఆర్‌ఎస్ మరియు జనసేన కు మద్య 1000 కోట్ల ఒప్పడం కుదిరిందని, ఏపీలో జనసేన పొత్తు కోసం కేసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ మద్య వార్తలు బాగా వినిపించాయి.
ఈ నేపథ్యంలో తాజా పరిణామాల్లో పవన్ తెలంగాణ మంత్రులకు ఫేవర్ గా మాట్లాడడంతో మరోసారి బిఆర్‌ఎస్ జనసేన దోస్తీని తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.
మరి దీనిపై జనసేనాని ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలంగాణలో రేపటి నుంచి బడిబాట